మొదటి భార్యకు పవన్ కళ్యాణ్ ఎందుకు విడాకులు ఇచ్చాడు, ఆమెకు భరణం ఎంత వచ్చిందో తెలుసా..?

Published : Jun 11, 2024, 12:52 PM IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టాలనే తన చిరకాల కలను నెరవేర్చుకున్న తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఆయన మొదటి భార్య ఎవరు..? ఆమెకు  ఎందుకు విడాకులు ఇచ్చారు?

PREV
18
మొదటి భార్యకు పవన్ కళ్యాణ్ ఎందుకు విడాకులు ఇచ్చాడు, ఆమెకు భరణం ఎంత వచ్చిందో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగుపెట్టాలన్న తన చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. నటుడు-రాజకీయవేత్త అయిన పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో గెలవడానికి రెండుసార్లు విఫలయత్నాలు చేశారు. కాని ఆయన గెలవకపోగా ఎన్నో అవమానాలు  చూశారు. 

28

కానీ 2024 ఎన్నికలు ఎట్టకేలకు కళ్యాణ్  జనసేన పార్టీకి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ప్రస్తుతం పవన్ కొత్త ప్రభుత్వంలో పెద్ద పాత్ర కోసం సిద్ధమవుతున్నారు.  అందరి దృష్టి అతని భార్య, మాజీ రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాపై ఉంది. ఎన్నికల విజయం తర్వాత ఆమె పవన్‌తో కలిసి కనిపించారు. మోదీ ప్రమాణస్వీకారానికి కూడా ఇద్దరు కలిసి వచ్చారు. 

38

లెజ్నేవా పవన్ కళ్యాణ్ కు  మూడవ భార్య; ఆయన గత రెండు పెళ్లిళ్ళు విడాకులు అయ్యాయి. మొదటి వివాహం చేదు జ్ఞాపకాలు అందించినట్టు తెలుస్తోంది.1996లో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు నందిని అనేఅమ్మాయిని పెళ్ళాడారు. నందిని  విశాఖపట్నానికి చెందిన అమ్మాయి.  సత్యానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నందిని కలిశాడు. 

48

సినిమా ప్రారంభమైన ఏడాది తర్వాత వారిద్దరూ హైదరాబాద్‌లో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే నందిని, పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు. వివాహం అయిన వెంటనే తన భార్య తననతో ఉండలేదని.. ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయిందని పవన్ ఆరోపించారు. కాని ఆమె ఈ ఆరోపణలు ఖండించింది. 

58

ఇద్దరు ఒకరిమీద మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.  అయితే వీరి గొడవలు నడుస్తుండగానే.. పవన్ కళ్యాన్ తన హీరోయిన్ అయిన  తన సహనటి రేణు దేశాయ్‌తో డేటింగ్ ప్రారంభించాడు.2007లో, నందిని తనకు విడాకులు ఇవ్వకుండానే రేణు దేశాయ్‌ను వివాహం చేసుకున్నారని పేర్కొంటూ పవన్ కళ్యాణ్‌పై కేసు వేసింది. 

68

అయితే రేణుకి పెళ్లి కాలేదని, లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందని పవన్ తరపున లాయర్లు వాదించారట. సాక్ష్యాధారాలు లేని కారణంగా అభియోగాల నుండి పవన్ ను  కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఒక వారం తర్వాత పవన్ కళ్యాణ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆగస్ట్ 2008లో, విడాకులు మంజూరు అయ్యాయి. 
 

78

అంతే కాదు పవర్ స్టార్ తన మొదటి భార్య నందినికి  5 కోట్ల భరణం చెల్లించాడు. విడాకుల తర్వాత నందిని ఇండియా ను వదలి  శాశ్వతంగా అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. 

88

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహం 2012లో విడాకులతో ముగిసింది. ఈ దంపతులకు అకీరా మరియు ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అఖీరా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇక పవర్ గతంలో తనతో డేటింగ్ చేసిన రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను పెళ్ళాడారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటున్నారు. 

Read more Photos on
click me!