OTT: `గుంటూరుకారం`, `సైంధవ్‌`, `హనుమాన్‌`, `నా సామి రంగ` ఓటీటీ రైట్స్ ఫుల్‌ డిటెయిల్స్..

Published : Jan 06, 2024, 10:38 PM IST

ఈ సారి సంక్రాంతి పండగ ఫుల్‌ సందడిగా ఉండబోతుంది. వరుస బెట్టి సినిమాలు రిలీజ్‌ కాబోతున్నాయి. దీంతో ఆడియెన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఈ మూవీల ఓటీటీ డీల్‌ కూడా ఆల్‌రెడీ కంప్లీట్‌ అయ్యిందట.   

PREV
16
OTT: `గుంటూరుకారం`, `సైంధవ్‌`, `హనుమాన్‌`, `నా సామి రంగ` ఓటీటీ రైట్స్ ఫుల్‌ డిటెయిల్స్..

సినిమాలకు ఓటీటీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మారింది. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. సినిమా ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో వస్తుందనేది ఆడియెన్స్ తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సినిమాని థియేటర్లో చూడకుంటే ఓటీటీ చూడొచ్చు అనేది వాళ్ల అభిప్రాయం. చాలా వరకు ఆడియెన్స్ థియేటర్ల కంటే ఓటీటీలోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే వీటికి ఆదరణ పెరుగుతుంది. 

26

ఇక ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. మహేష్‌బాబు `గుంటూరు కారం`, వెంకటేష్‌ `సైంధవ్‌`, నాగార్జున `నా సామి రంగ`, తేజ సజ్జా `హనుమాన్‌` చిత్రాలు సంక్రాంతికి పోటీ పడుతున్నాయి.  మరి ఈ మూవీస్‌ ఏ ఓటీటీలో రాబోతున్నాయి, ఏ ఏ సినిమా ఎంతకు అమ్ముడు పోయిందనేది ఓ సారి చూస్తే.. 

36

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న `గుంటూరు కారం` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ నిర్మించే ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్ లో రాబోతుంది. దాదాపు ఆరు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రాబోతుందని తెలుస్తుంది. దాదాపు యాభై కోట్లకి ఈ మూవీ డిజిటల్‌ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. సుమారు 135కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగిందని తెలుస్తుంది.
 

46

దీంతోపాటు సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాల్లో `హనుమాన్‌` ఉంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీని ప్రశాంత్‌ వర్మ రూపొందించారు. మైథలాజికల్‌ అంశాలకు ప్రస్తుత అంశాలను జోడించి ఈ మూవీని రూపొందించాడు ప్రశాంత్‌ వర్మ. సరికొత్త ప్రయోగం చేశాడు. జనవరి 12న పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతుందీ మూవీ. దీని ఓటీటీ రైట్స్ జీ5 దక్కించుకుంది. సుమారు పది కోట్లకి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందట. ఇది మార్చిలో ఓటీటీలో రానుంది. ఇక సుమారు 25కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగిందని సమాచారం. 
 

56

సంక్రాంతి బరిలో సీనియర్‌ హీరోలు ఉన్నారు. వారిలో వెంకీమామ ముందున్నారు. ఆయన నటించిన `సైంధవ్‌` మూవీ జనవరి 13న విడుదల కానుంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తుంది. ఇందులో బాల నటి సారా, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, ఆండ్రియాతోపాటు ఆర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్‌సిద్ధిఖీ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నాడు.ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని `ఈటీవీవిన్‌` దక్కించుకుందట. సుమారు 15కోట్లకు ఓటీటీ రైట్స్ దక్కించుకుందని తెలుస్తుంది. అలాగే 25కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యిందని సమాచారం. 

66

లేట్‌గా అయినా,లేటెస్ట్ గా రాబోతున్నారు మన్మథుడు నాగార్జున. ఆయన `నా సామి రంగ` చిత్రంతో సంక్రాంతికి వస్తున్నారు. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుందట. అత్యధికంగా ఇది రూ.32కోట్లకి ఓటీటీ రైట్స్ దక్కించుకుందట. హాట్‌ స్టార్‌తో నాగార్జునకి ఉన్న రిలేషన్‌ నేపథ్యంలో దీన్ని గట్టిగానే అమ్మేసినట్టు సమాచారం. ఇక ఈ సినిమా రూ. 18కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ జరిగింది. దీంతో ఇప్పటికే ఇది టేబుల్‌ ఫ్రాఫిట్‌లో ఉందని చెప్పొచ్చు. సినిమా విడుదలైన ఆరు నుంచి 8 వారాల్లో సినిమా ఓటీటీలో రానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories