Kaatera Collections: వారం రోజుల్లో వంద కోట్లు.. `సలార్‌`ని దెబ్బకొట్టి దుమ్మురేపుతున్న `కాటేరా`

First Published Jan 6, 2024, 6:45 PM IST

కన్నడ స్టార్‌ దర్శన్‌ నటించిన `కాటేరా` మూవీ కలెక్షన్లు దుమ్మురేపుతుంది. కన్నడ నాట విడుదలైన ఈ మూవీ వారం రోజులోనే అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. 
 

దర్శన్‌ హీరోగా రూపొందిన `కాటేరా` మూవీ గత వారం థియేట్లలో విడుదలైంది. `సలార్‌` హవా సాగుతున్న సమయంలోనే ఈ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఒక్క రోజుల్లోనే అదరగొట్టింది. మంచి ఓపెనింగ్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. బలమైన కంటెంట్‌తో సినిమా తెరకెక్కడం, చాలా రోజుల తర్వాత నెటివిటీ ప్రాధాన్యతతో కూడిన సినిమా కావడంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 
 

రెండో రోజు నుంచి ఈ మూవీకి థియేటర్లు పెరిగాయి. `సలార్‌` థియేటర్లు సైతం ఈమూవీకి ఇవ్వాల్సి వచ్చింది. అంతగా ఆదరణ దక్కుతుంది. రైతు చట్టాలను, వ్యవసాయం ప్రాధాన్యతని తెలియజేసే కథాంశం కావడంతో లోకల్‌ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.పైగా `సలార్‌` మూవీ ఆల్‌ రెడీ వచ్చిన `ఉగ్రం`కి రీమేక్‌ కావడంతో దాన్ని చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. రెండో వారంలో అది డీలా పడింది. అదే సమయంలో `కాటేరా` పుంజుకుంది. 
 

Latest Videos


రెండు రోజుల్లోనే ఈ మూవీ 37కోట్లు వసూలు చేసి, `సలార్‌`ని దాటేసింది. మూడో రోజు యాభై కోట్లు దాటింది. నాల్గో రోజు 70కోట్లకు చేరుకుంది. మొదటి వీకెండ్‌లోనే ఈ మూవీ భారీ వసూళ్లని సాధించింది. ఇక మొదటి వారాంతంలో ఈ సినిమా వంద కోట్లు దాటింది. వారం రోజుల్లో `కాటేరా` 104కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. నిర్మాతలకు, బయ్యర్లకి లాభాల పంట పండిస్తుంది. ఈ సినిమా కొట్టే మూవీ మరోటి రాకపోవడంతో ఇంకా థియేటర్లలో హవా చూపిస్తుంది. 

అయితే చాలా రోజుల తర్వాత కన్నడలో ఓ మూవీ వంద కోట్ల మార్క్ దాటడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీది ఫేక్‌ కలెక్షన్లు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎక్కువగా కలెక్షన్లని ప్రకటిస్తున్నారని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. కానీ ఈ మూవీ ఇప్పటికీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ శనివారం, ఆదివారం బుకింగ్స్ పెరగడం విశేషం. ఈ రెండు రోజులు భారీగానే వసూలు చేసే అవకాశం ఉంది. 
 

దర్శన్‌, ఆరాధన రామ్‌ జంటగా నటించిన `కాటేరా` సినిమాలో జగపతిబాబు, కుమార్‌ గోవింద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించారు. రాక్‌ లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు. వ్యవసాయం, రైతు చట్టాలపై యాక్షన్‌ ఎమోషనల్‌ డ్రామా మూవీగా తెరకెక్కిందీ చిత్రం.  
 

click me!