త్రివిక్రమ్, పూరీ, బోయపాటి, కొరటాల.. తమ మార్క్ కోల్పోతున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు? ఫ్యాన్ వర్రీ!

Published : Jan 12, 2024, 07:19 PM ISTUpdated : Jan 12, 2024, 07:23 PM IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు తమ రీసెంట్ సినిమాలతో అభిమానులు ఘోరంగా నిరాశ పరిచారు. నెగెటివ్ టాక్ కు కూడా ఆస్కారం లేని తమ సినిమాలపై ఆడియెన్స్ ఇచ్చే రివ్యూలు కూడా బాధాకరంగా ఉంటున్నాయి.

PREV
16
త్రివిక్రమ్, పూరీ, బోయపాటి, కొరటాల.. తమ మార్క్ కోల్పోతున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు? ఫ్యాన్ వర్రీ!

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎస్ఎస్ రాజమౌళి SS Rajamouli, సుకుమార్ వంటి దర్శకులు సినిమాస్థాయిని పెంచుతుంటే... ఓవైపు టాప్ డైరెక్టర్లు, ఎంతో మంది అభిమానులు, ఆడియెన్స్ తమ సినిమాల గురించే ఎదురుచూసే దర్శకుల నుంచి వచ్చే చిత్రాలు మరీ నిరాశపరుస్తున్నాయి. 

26

రీసెంట్ కాలంలో అభిమానులను, తెలుగు ప్రేక్షకులను తమ చిత్రాలతో చాలా నిరాశ పరిచిన దర్శకుల విషయానికొస్తే... డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  చాలా నిరాశ పరిచారు. ఆ చిత్రం ‘లైగర్’ Liger అనే విషయం తెలిసిందే. పూరీ నుంచి ఇలాంటి సినిమాను అభిమానులు, ఆడియెన్స్ కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు. 

36

ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ KoratalaSiva నుంచి కూడా డిజాస్టర్ మూవీ వచ్చింది. చిరు, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’తో ఫ్యాన్స్ ఎంత నిరాశపరిచారో తెలిసిందే. కొరటాల సినిమాకు నెగెటివ్ రివ్యూలు రావడం ఫ్యాన్స్ ను బాధించింది. 

46

మాస్, యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ది చెందిన తెలుగు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ Boyapati Srinivas కూడా గతేడాది ప్రేక్షకులను నిరాశపరిచారు. ‘అఖండ’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ‘స్కంద’Skanda తో మరీ దారుణమైన సినిమాను తీశారనే రివ్యూలను పొందారు. 
 

56

తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ Trivikram కూడా ‘గుంటూరు కారం’ Guntur Kaaramతో ఆశించిన స్థాయిలో సినిమాను అందించలేకోయారని... అభిమానులు అప్సెట్ అవుతున్నారు. కేవలం మహేశ్ బాబును మాస్ గా చూపించారే గానీ.. త్రివిక్రమ్ మార్క్ సినిమా కాదని.. Mahesh babu డేట్స్ ఇవ్వడమే గొప్ప విషయం.. అలాంటిది త్రివిక్రమ్ ఎలాంటి సినిమా తీయాలో కాస్తా మరిచారని అంటున్నారు.
 

66

మొత్తానికి పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, బోయపాటి, కొరటాల తమ మార్క్ సినిమాలతో టాలీవుడ్ లో ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు డైరెక్టర్ల చివరి చిత్రాల్లో తమ మార్క్ సినిమా కాదనే అభిప్రాయలు వెల్లడయ్యాయి. దీంతో నెక్ట్స్ సినిమాలతోనైనా ఫ్యాన్స్, ఆడియెన్స్ అంచనాలను రీచ్ కావాల్సి ఉంది.  

click me!

Recommended Stories