Aishwarya Rai : అభిషేక్ బచ్చన్ బర్త్ డే.. డివోర్స్ రూమర్లకు గట్టిగా బదులిచ్చిన ఐశ్వర్య రాయ్!

First Published | Feb 6, 2024, 12:21 PM IST

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ Abhishek Bachchan పుట్టిన రోజున ఐశ్వర్య రాయ్ బ్యూటీఫుల్ గా విష్ చేసింది. ఇటీవల వచ్చిన డివోర్స్ రూమర్లకు చెక్ పెట్టేలా పోస్ట్ చేసింది. 

బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ Abhishek Bachchan - ఐశ్వర్య రాయ్ Aishwarya Rai Bachchan విడిపోతున్నట్టు ఆ మధ్యలో రూమర్లులు వచ్చాయి. వీటిపై ఎప్పుడూ వీరిద్దరూ స్పందిచలేదు. 

తరుచుగా రూమర్లు గుప్పుమంటూనే ఉన్నాయి. రీసెంట్ గా అయోధ్యలోనూ అభిషేక్ బచ్చన్ ఒంటరిగానే కనిపించడంతో మళ్లీ పుకార్లు ఊపందుకున్నాయి. ఎన్ని సార్లు డివోర్స్ వార్తలు వచ్చినా.. వారు మాత్రం స్పందించడం లేదు. 


ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్య రాయ్ Aishwarya Rai పరోక్షంగా ఆ రూమర్లకు చెక్ పెట్టింది. అభిషేక్ 48వ పుట్టిన రోజున బ్యూటీఫుల్ గా విష్ చేసింది. ఫ్యామిలీ ఫొటోనూ అభిమానులతో పంచుకుంది. 

భర్తకు ఐశ్వర్య విష్ చేస్తూ... ‘ఆనందం, ప్రేమ, ప్రశాంతత, శాంతి, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని... మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరింతగా ఎదగాలని కోరుకుంటున్నాను’. అంటూ విష్ చేసింది. అలాగే భర్త చిన్నప్పటి ఫొటోను కూడా పంచుకుంది.

అభిషేక్ కు ఇంత ప్రేమగా విష్ చేయడంతో విడాకుల రూమర్లకు అడ్డుకట్ల పడింది. ఇక ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆధ్య బచ్చన్, భర్త అభిషేక్ బచ్చన్ కలిసి ఉన్న ఫొటోను పంచుకోవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 
 

ఇక ఐశ్వర్య రాయ్ ‘ధూమ్2’ మూవీతో అభిషేక్ బచ్చన్ కు దగ్గరైంది. 14 జనవరి 2007న వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. 20 ఏప్రిల్ 2007న ముంబైలో గ్రాండ్ గా జరిగింది. 2011 నవంబర్ 16న వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. 
 

Latest Videos

click me!