బాలకృష్ణ సినిమాపై రూమర్స్.. మహేష్ బాబు మీమ్ తో డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై , హీరోయిన్ విషయంలోనే రచ్చ

Published : Mar 29, 2026, 09:23 PM IST

ఎన్ బీకే 111లో డింపుల్ హయతి నటిస్తున్నారన్న ప్రచారంపై గోపీచంద్ మలినేని మీమ్‌తో స్పందించారు. వస్తున్న రూమర్స్ ని ఆయన ఖండించిన విధానం చాలా ఫన్నీగా ఉంది.

PREV
15
Balakrishna

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణతో దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఎన్ బీకే 111పై వస్తున్న ప్రచారాలపై తాజాగా స్పందించారు. ముఖ్యంగా నటి డింపుల్ హయతి ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

25
డింపుల్ హయతి పేరు హీరోయిన్‌గా ఫైనల్ ?

సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు రూమర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా డింపుల్ హయతి పేరు హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందన్న వార్తలు విస్తృతంగా ప్రచారం పొందాయి. ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేని నేరుగా సమాధానం ఇవ్వకుండా వినోదాత్మకంగా ఒక మీమ్‌ను పంచుకున్నారు. ఆయన షేర్ చేసిన వీడియోలో మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన “ఎవరైనా చెప్పారా… నేను ఎవరికీ చెప్పలేదు” అనే డైలాగ్ ఉంది.

35
సోషల్ మీడియాలో వైరల్

ఈ మీమ్ ద్వారా డింపుల్ హయతి క్యాస్టింగ్‌పై వస్తున్న వార్తలను పరోక్షంగా ఖండించినట్లయ్యింది. ఆయన స్పందనతో ఈ ప్రచారాలపై కొంత స్పష్టత వచ్చినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, మీమ్ ద్వారా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

45
భారీ పీరియడ్ డ్రామా

ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొదట ఈ సినిమాను భారీ పీరియడ్ డ్రామాగా రూపొందించాలని భావించినట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో రాజ వంశీయ యోధులుగా కనిపిస్తారని, అలాగే నయనతార రాణి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపించాయి.

55
బడ్జెట్‌పై చిత్ర బృందం పునరాలోచన

అయితే ‘అఖండ 2’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ స్కేల్, బడ్జెట్‌పై చిత్ర బృందం పునరాలోచన చేసినట్లు సమాచారం. దాంతో కథను పూర్తిగా మార్చి, పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌ను వదిలి మరింత కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథగా మలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్ బీకే 111పై వస్తున్న ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories