యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తన పెళ్లి ప్లాన్స్‌పై వస్తున్న రూమర్స్‌పై కృతి స్పందించింది. త్వరలో ఆమె షాహిద్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి 'కాక్‌టెయిల్ 2'లో కనిపించనుంది.
యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో కృతి సనన్ డేటింగ్‌లో ఉందనే రూమర్లు వీరిద్దరూ కలిసి కనిపించడంతో మొదలయ్యాయి. ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కృతి సోదరి నుపుర్ సనన్, స్టెబిన్ బెన్ పెళ్లికి కబీర్ హాజరయ్యాడు. అక్కడ కృతి ఫోటోలను ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఓ కార్యక్రమంలో తన పెళ్లిపై కృతి గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి!
24
బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి సందడి
ఈ ఏడాది మొదట్లో కృతి సనన్ చెల్లెలు, నటి నుపుర్ సనన్, మ్యూజిషియన్ స్టెబిన్ బెన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వేడుకలో కృతి తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ కబీర్ బహియాతో కలిసి సందడి చేసింది. దీంతో కృతి పెళ్లి ఎప్పుడనే ఆసక్తి అందరిలో మొదలైంది. 'టైమ్స్ నౌ సమ్మిట్ 2026'లో కృతిని ఇదే ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె కాస్త అసహనానికి గురైంది. 'మీరేమైనా మా చాచీజీనా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని అడగడానికి? పెళ్లి కంటే జీవితంలో చాలా విషయాలుంటాయి' అని ఘాటుగా బదులిచ్చింది.
34
రూమర్లన్నింటికీ ఫుల్‌స్టాప్
తన పెళ్లిపై వస్తున్న రూమర్లన్నింటికీ కృతి ఫుల్‌స్టాప్ పెట్టింది. తనకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. 'పెళ్లి చేసుకోవడానికి నేనేం తొందరపడట్లేదు' అని ఆమె తేల్చి చెప్పింది.