నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. దర్శకుడు గోపీచంద్ మలినేని, నెగిటివ్ రోల్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ తో పాటు మైత్రి నిర్మాత నవీన్, రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ షోలో హాజరయ్యారు.