బాలకృష్ణ (Balakrishna) హోస్ట్ గా రన్ అవుతున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే`(UnstoppablewithNBK2) ఎంతటి ఆదరణ పొందుతుందో తెలిసిందే. ఇండియాలోనే టాప్ వన్ టాక్ షోగా నిలిచింది. అత్యధికంగా వీక్షిస్తున్న షోగా నిలుస్తుంది. ఇందులో టాలీవుడ్ టాప్ స్టార్లు, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం ఓ విశేషమైతే, వాళ్లు సంచలన విషయాలు, మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించడం మరో విశేషం. ఇవన్నీ పక్కన పెడితే బాలకృష్ణ వంటి సీనియర్, కల్ట్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో హోస్ట్ గా చేయడం ఇంతటి క్రేజ్‌కి కారణమని చెప్పొచ్చు. ఎప్పుడూ హోస్ట్ గా చేయని బాలయ్య మొదటి సారి వ్యాఖ్యాతగా మారి చేస్తుండటంతో, బోల్డ్ గా గెస్ట్ లను ప్రశ్నించడం వంటివి ఈ షోకి మరింత హైప్‌ని తీసుకొస్తున్నాయి.