అమెరికన్లకి ఇండియన్‌ టేస్ట్ చూపించబోతున్న ప్రియాంక చోప్రా.. న్యూ జర్నీ

First Published Mar 8, 2021, 9:09 AM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరో అడుగు ముందుకేశారు. ఫుడ్‌ బిజినెస్‌లో ఎంటరయ్యారు. ఓ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. అయితే అది ఇక్కడ కాదు. ఏకంగా అమెరికాలో. న్యూయార్క్ `సోనా` పేరుతో ఇండియన్‌ రెస్టారెంట్‌ని ప్రారంభించడం విశేషం. ఈ విషయాన్ని ప్రియాంక వెల్లడించారు. 
 

తన భర్త, పాప్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌తో కలిసి ప్రియాంక చోప్రా న్యూయార్క్ లో ఇండియన్‌ రెస్టారెంట్‌ని ప్రారంభించారు. ఈమేరకు తాజాగా ఆమె పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.
undefined
ఇటీవల తన కొత్త హెయిర్‌ కేర్‌ లైన్‌ `అనోమలీ`ని పరిచయంచేసింది ప్రియాంక. ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం విశేషం. ఇందులో ఇండియాకి చెందిన ఫుడ్‌(భారతీయ వంటకాలు)ని అమెరికన్లకి పరిచయం చేయబోతుండటం మరో విశేషం.
undefined
దీన్ని ఈ నెలాఖరులో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. ఓపెన్‌ చేయనున్నారు. ఇందులో ప్రఖ్యాత పాపులర్‌ చెఫ్‌ హరి నాయక్‌ హెడ్‌ చెఫ్‌గా ఉండబోతున్నట్టు ప్రియాంక వెల్లడించింది.
undefined
న్యూయార్క్ లో సోనా రెస్టారెంట్‌ని ప్రారంభించడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. భారతీయ ఆహారం పట్ల నాకు ప్రేమని ఈ రూపంలో కురిపించబోతున్నా. సోనా అనేది టైమ్‌లెస్‌ ఇండియా స్వరూపం. నేను తింటూ పెరిగిన రుచులను ఇందులో చూడొచ్చు. ఇక అత్యంత రుచికరమైన, వినూత్నమైన వంటకాలను సృష్టించిన ఇండియన్‌ చెఫ్‌ హరి నాయక్‌ చేత ఇది రన్‌చేయడం నమ్మశక్యం కావడం లేదు.
undefined
ఈ నెలాఖరులో సోనా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను. ఇది ప్రారంభించడంలో సపోర్ట్ చేసిన నా స్నేహితులు మనీష్‌ గోయల్‌, డేవిడ్‌ రాబిన్‌లకు ధన్యవాదాలు. వారు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు` అని తెలిపింది ప్రియాంక. దీనికి ప్రియాంక మామ పాల్‌ కెవిన్‌ జోనాస్‌తోపాటు ఇతర సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
undefined
ఇదిలా ఉంటే తమ ఫ్యామిలీ లండన్‌లో మీట్‌ అయ్యారట. చాలా రోజుల తర్వాత ఇలా రీయూనియన్‌ కావడం, తమ నివాసానికి రావడం పట్ల ప్రియాంక ఆనందం వ్యక్తం చేసింది.
undefined
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌ కే పరిమితమవుతుంది. ఇటీవల `ది వైట్‌ టైగర్‌` చిత్రంలో నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ఇప్పుడు `మ్యాట్రిక్స్`, `టెక్ట్స్ ఫర్‌ యూ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు బిజినెస్‌, ఇంకో వైపు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
undefined
click me!