నెలరోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న కూలీ.. రజినీకాంత్, నాగార్జున ఫ్యాన్స్ కి పండగే

Published : Sep 03, 2025, 03:48 PM IST

రజనీకాంత్ నటించిన కూలీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది.

PREV
15

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం “కూలీ” ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని త్వరలో ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ఆగస్టు 14న విడుదలైంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ రెండో వారంలో ప్రీమియర్ కానుంది.

25

సినిమా విడుదలైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి వస్తుండటం విశేషం. థియేట్రికల్ రన్‌లో ఈ చిత్రం ₹300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినప్పటికీ  కొన్ని కీలక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ చిత్రానికి కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. 

35

తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో రన్ చేయకపోయినా, రజనీకాంత్ స్టార్ పవర్‌తో గణనీయమైన వసూళ్లు సాధించగలిగింది. ఇదిలా ఉండగా కూలీ చిత్రాన్ని సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

45

థియేటర్‌లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం పొందనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా, రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, లోకేష్ కనగరాజ్ తన ప్రత్యేక శైలిలో కథను మలిచారు.

55

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అధికారిక విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. రజనీకాంత్ సినిమాలు ఎప్పుడూ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో మంచి వ్యూయర్‌షిప్ సాధించే నేపథ్యంలో, “కూలీ” కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది అని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories