ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా, ప్రేమ పేరుతో వెంటపడే కొద్దిమంది ప్రేమికుల గురించి తరచూ వింటూనే ఉంటాం, కొన్నిసార్లు తమని ప్రేమించలేదని ఎదుటి వ్యక్తులపై అఘాయిత్యాలకి పాల్పడటం, మరికొన్నిసార్లు దేవదాసులుగా మారిపోవడం లాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అలాంటి అపరిపక్వమైన ఆలోచనలున్న ఓ యువకుడి ప్రేమకథగా రూపొందించిన చిత్రం.