గెటప్ శ్రీను భార్యకు ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు, చేసేదేమీ లేక సోషల్ మీడియాలో వేడుకున్న వైనం

First Published Jun 1, 2021, 9:09 AM IST


జబర్దస్త్ కామెడిన్స్ లో గెటప్ శ్రీనుకు అంటే తెలియనివారుండరు. దాదాపు ఈ షో బిగినింగ్ నుండి ఆయన ఉన్నారు. ప్రతి స్కిట్ కి కొత్త గెటప్ ట్రై చేస్తూ గెటప్ నే తన పేరుగా మార్చేసుకున్నాడు ఆయన. కాగా గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. 

గెటప్ శ్రీను కొన్నేళ్ల క్రితం సుజాతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి హేమాన్ష్ కార్తికేయ అనే ఓ బాబు కూడా ఉన్నారు. కాగా సెలెబ్రిటీల భార్యకు కూడా ఎంతో కొంత పాపులారిటీ ఉంటుంది. ఆ ఫేమ్ వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు తెలివైన భార్యలు.
undefined
గెటప్ శ్రీను భార్య సుజాత సైతం ఓ ఆన్లైన్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా లేడీ గార్మెంట్స్, యాక్సెసరీస్, జ్యువెలరీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఐతే ఈ బిజినెస్ లో సుజాతకు చిన్న చిక్కొచ్చి పడింది.
undefined
బిజినెస్ కి ఉపయోగిస్తున్న సుజాత సోషల్  మీడియా అకౌంట్స్ ఎవరో హ్యాక్ చేశారట. దీనితో ఆ అకౌంట్స్ తన పరిధిలో లేకుండా పోయాయని ఆమె వీడియో సందేశంలో తెలిపారు.
undefined
అయితే కొత్తగా రెండు ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ స్టార్ట్ చేసినట్లు, బట్టలు, ఆభరణాలు కావాల్సిన వాళ్ళు వాటిని ఫాలో కావాలని కోరారు. తనను సపోర్ట్ చేయాలని వేడుకున్నారు.
undefined
బుల్లితెర నటులైన శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఇప్పటికే వ్యాపారాలు మొదలుపెట్టారు. నటులే కాకుండా భార్యలు కూడా ఈ విధంగా రంగంలోకి దిగుతున్నారన్న మాట.
undefined
ఇక జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న గెటప్ శ్రీను వెండితెరపై బిజీ అయ్యారు. కమెడియన్ గా అతను వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారు.
undefined
ఇక హీరోగా కూడా గెటప్ శ్రీను మారడం విశేషం. రాజు యాదవ్ పేరుతో గెటప్ శ్రీను హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
undefined
గతంలో గెటప్ శ్రీను 3 మంకీస్ మూవీలో హీరోగా చేశారు. ఆ చిత్రంలో గెటప్ శ్రీనుతో పాటు తన జబర్దస్త్  టీమ్ మేట్స్ సుధీర్, రామ్ ప్రసాద్ కూడా హీరోలుగా చేశారు.
undefined
click me!