సినీ పరిశ్రమ చాలా క్రూరమైంది, బతకడం కష్టంః `పోకిరి` భామ ఇలియానా సంచలన వ్యాఖ్యలు(అన్‌సీన్‌ పిక్స్)

First Published | May 31, 2021, 8:37 PM IST

`పోకిరి` భామ, గోవా బ్యూటీ ఇలియానా సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా క్రూరమైనదని, ఇక్కడ బతకడం కష్టమని షాకింగ్‌ కామెంట్‌ చేసింది. దీంతో ఇప్పుడీ సెక్సీ భామ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

ఇలియానా తన సన్నని నడుము అందాలతో ఇటు తెలుగు, అటు తమిళం, మరోవైపు హిందీ చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే.
`పోకిరి` సినిమాతో తెలుగులో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యిందీ భామ. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. నాజూకైన నడుమందాలతో ఆడియెన్స్ ని ఫిదా చేసింది.

ఇటీవల కెరీర్‌ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ హాట్‌ బేబీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బతకడం కష్టమని తెలిపింది.
ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఈ భామ ఇప్పుడు సినీ పరిశ్రమపైనే ఇలాంటి అనుచిత, షాకింగ్‌ కామెంట్లు చేయడం హాట్‌ టాపిక్‌గా మారడమేకాదు పెద్ద దుమారం రేపుతున్నాయి.
`సినీ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. ఇక్కడ బతకడం చాలా కష్టంతో కూడిన విషయం. ఆడియెన్స్ చూసేంత వరకే మేం స్లార్లుగా రాణిస్తాం. వాళ్లు ఒక్కసారి మమ్మల్ని చూడటం ఆపేస్తే, మా నుంచి తల తిప్పుకుంటే అన్నీ కోల్పోతాం. నా విషయంలో అదే జరిగింది` అని సెన్సేషనల్‌ కామెంట్‌ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా ఇలాంటి షాకింగ్‌ కామెంట్లు చేసింది. ఇటీవల ఆమె కెరీర్‌ సరిగా సాగడం లేదు. అనారోగ్య సమస్యలు, తన బాడీపై విమర్శలు ఎదుర్కొవడం వంటి కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లింది. చాలా ఇబ్బంది కూడా పడింది.
ఈ నేపథ్యంలో ఆమె ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలియానా ఇంకా చెబుతూ, చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి చాలా చెడ్డ విషయాలున్నాయని తెలిపింది.
డబ్బు సంపాదించుకోవడానికి ఇది సరైన దారి అని, సినిమా అనేది డబ్బు సంపాదించే యంత్రమని తాను ఒప్పుకుంటున్నట్టు పేర్కొంది. అదే సమయంలో ఇక్కడ తమ అభిరుచికి తావులేదని పేర్కొంది. అది చాలా కష్టంతో కూడినదని చెప్పింది.
`చాలా విషయాలు మనకు సంబంధం లేకుండానే జరిగిపోతుంటాయి. మనం వాటన్నింటిని తట్టుకుని, ఎలాంటి అనుభవాలనైనా ఎదుర్కొంటూ, వాటిని ఆస్వాదిస్తూ ముందుకు సాగాలి. ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు. ప్రజల ఫోకస్‌ ని బట్టే విలువ, కెరీర్‌ ఉంటుంది. వాళ్ల ఫోకస్‌ మారితే మన లైఫ్‌ మారిపోతుంది` అని తెలిపింది ఇలియానా.
అంతేకాదు తనకు నచ్చకపోతే ఆ హీరోల సినిమాలు చూడనని, నచ్చిన హీరోల సినిమాలే చూస్తానని పేర్కొంది. మొత్తంగా చిత్ర పరిశ్రమపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇలియానా.
ఇలియానా ఆ మధ్య ప్రముఖ ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమయాణం నడిపించింది. కొన్నాళ్ల తర్వాత ఆయన్నుంచి విడిపోయింది. దీంతో తిరిగి సినిమాలపై దృష్టిపెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు.
ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో `అన్‌ఫెయిర్‌ ఎన్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది.

Latest Videos

click me!