'రాజా శివాజీ' ట్రైలర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇందులో అంతకంటే ఓ స్పెషల్ విషయం మరోకటి ఉంది. ఈసినిమాలో చిన్నారి శివాజీగా కనిపించి.. నటనతో అదగొట్టిన 10 ఏళ్ల కుర్రాడు ఎవరో తెలుసా? తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.
'రాజా శివాజీ' ట్రైలర్ రిలీజవగానే వైరల్ అయింది. కానీ అందులోని ఓ చిన్న సీన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. . ఆ సీన్‌లో చిన్ననాటి శివాజీగా కనిపించింది ఎవరో కాదు. రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా కొడుకు రాహిల్ దేశ్‌ముఖ్. ఈ సినిమాతోనే రాహిల్ సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతున్నాడు.
25
చిన్నారి శివాజీగా రాహిల్ దేశ్‌ముఖ్
ఈ ట్రైలర్‌లో రాహిల్ దేశ్‌ముఖ్‌ను ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి పాత్రలో చూపించారు. ఒక సీన్‌లో అతను తన సోదరుడితో మాట్లాడుతుంటాడు. ఈ సీన్ చిన్నదే అయినా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
35
10 ఏళ్ల వయసులోనే నటుడిగా రాహిల్ దేశ్‌ముఖ్
జూన్ 2, 2016న పుట్టిన రాహిల్.. రితేశ్, జెనీలియా దంపతుల రెండో కొడుకు. ఈ స్టార్ కపుల్ తమ పిల్లల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకుంటారు. అయితే, సినిమాలో రాహిల్ నటిస్తున్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
'రాజా శివాజీ' కేవలం సినిమా కాదు, ఓ అద్భుతమైన చారిత్రక అనుభూతిని పంచే ప్రయత్నం. ట్రైలర్‌లోని విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, వారసత్వాన్ని భారీ స్థాయిలో చూపించారు. ఇందులో హిస్టరి, డ్రామా రెండూ అద్భుతంగా మిక్స్ అయ్యాయి.
55
'రాజా శివాజీ'లో భారీ తారాగణం
రితేశ్ దేశ్‌ముఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హిందీ, మరాఠీ ఇండస్ట్రీల నుంచి చాలా పెద్ద నటులు ఉన్నారు. సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, మహేశ్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, బోమన్ ఇరానీ, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే వంటి స్టార్లు ఇందులో నటిస్తున్నారు. ఇది సినిమాకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. సల్మాన్ ఖాన్ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమా 2026 మే 1న మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.