ఇంటికి వచ్చిన తల్లిని అవమానించిన అంకిత.. తులసి పరువును కాపాడిన పెద్ద కోడలు!

Published : Apr 15, 2022, 11:58 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
ఇంటికి వచ్చిన తల్లిని అవమానించిన అంకిత.. తులసి పరువును కాపాడిన పెద్ద కోడలు!

నందు తులసికి ప్రేమ్ (Prem) విషయం లో నా అవసరం లేకపోవచ్చు కానీ దివ్య విషయంలో అలాకాదు తండ్రిగా నా అవసరం ఉంటుంది. కాబట్టి తులసి ఎప్పటికైనా నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అని లాస్య (Lasya) తో చెబుతాడు. మరోవైపు అనసూయ టీవీ సీరియల్ చూడ్డానికి టీవీ లేనందుకు ఇంట్లో వాళ్ళ పై విరుచుకు పడుతుంది. 
 

26

ఆ తరువాత దివ్య (Divya).. అన్నయ్య కూడా ఇక్కడ ఉంటే బావుండేది అని తులసి తో అంటుంది. ఇక తులసి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఇక అనసూయ (Anasuya).. పరందామయ్య ను అనేక మాటలతో ఫన్నీగా విరుచుకు పడుతూ హడావిడి చేస్తుంది.
 

36

ఇక అంకిత (Ankitha) ఇల్లు తుడుస్తుండగా ఈలోపు అక్కడకు గాయత్రి వస్తుంది. ఇంటికోడలిని ఇలాగేనా ట్రీట్ చేసేది అని తులసి పై విరుచుకు పడుతుంది. దాంతో తులసి (Tulasi) ఇంట్లో అందరు కలిసి పని పంచుకోవడంలో ఉన్న ఆనందం నీకు తెలియదు అని అంటుంది. దాంతో గాయత్రి పని మనిషిని పెట్టుకునే తాహతా లేదని ఒప్పుకో డొంక తిరుగుడు ముచ్చట్లు వద్దు అని అంటుంది.
 

46

అదే క్రమంలో గాయత్రి (Gayathri) మీ ఆశలు ఆకాశంలో ఎగురుతాయి. మీ బ్రతుకులు భూమి మీదనే ఉంటాయి అని అంటుంది. ఇక అదే క్రమంలో గాయత్రి తులసి (Tulasi) పై నానా మాటలతో విరుచుకు పడుతుంది. అంతే కాకుండా అంకితను నీకు ఈ కష్టం వద్దు నేను కొన్న ఇంటిలో ఉండు అని తన ఇంటి కీస్ ఇస్తుంది.
 

56

ఇక అంకిత (Ankitha) వాళ్ళ అత్తగారికి సపోర్ట్ చేస్తూ అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ముందు బైటకు  వెళ్లు అని విరుచుకుపడుతుంది. మరో వైపు శృతి (Shruthi).. ప్రేమ్ కు తన జీవిత లక్ష్యం విషయంలో ధైర్యం చెబుతుంది.
 

66

ఇక తరువాయి భాగంలో గాయత్రి (Gayathri) అంకిత పేరుమీద త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కొన్నాను తీస్కో అని అభి కు ఇస్తుంది. అభి ఏ మాత్రం సందేహించకుండా తీసుకుంటాడు. ఇక దాంతో అంకిత (Ankitha)  అభి పై విరుచుకు పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories