Guppedantha Manasu: మిత్ర ద్రోహి అంటూ గౌతమ్ ని అపార్థం చేసుకున్న రిషి.. బాధపడుతున్న మహేంద్ర?

First Published Dec 3, 2022, 8:50 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో రిషి నన్ను ఫూల్ చేసావ్. రేయ్ గౌతమ్ నీకు వంద కారణాలు ఉండొచ్చు కానీ నీ ఫ్రెండుని కదరా ఇంత మోసం ఎలా చేశావురా అంటూ బాధతో మాట్లాడుతాడు రిషి. దీనికన్నా నన్ను కత్తితో పొడిచి చంపేసి ఉంటే ఇంకా బాగుండేది అని అంటాడు రిషి. అప్పుడు గౌతమ్ రుషి నా మాట నమ్మురా అంకుల్ నన్ను వద్దని చెప్పారు రా అని అనగా రేయ్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను అని అంటాడు. నన్ను నమ్మురా ప్లీజ్ అనగా నేను నిన్ను నమ్మను మిత్రదోహి నువ్వు నాతో మాట్లాడకు అని అంటాడు రిషి. రేయ్ రిషి కావాలి అంతే నన్ను కొట్టురా  అంతేకానీ మన మధ్య ఫ్రెండ్షిప్ లేదు అనకురా అని అనగా ఫ్రెండ్షిప్ అంటే అది ఒక గొప్ప పదం అని అంటాడు రిషి.
 

మనం ఒక్కసారి కూడా కలవము అని గౌతమ్ ని చీదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు రిషి గతంలో జరిగిన విషయాలు తలచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ మీద కోపంతో రగిలిపోతుండగా వెంటనే వసుధర తప్పు కేవలం గౌతమ్ సార్ దేనా సార్ అనడంతో రిషి కారు ఆపి ఏమన్నావ్ అని అంటాడు. అవును సార్ జగతి మేడం మహేంద్ర సార్ ల తప్పు కూడా ఉంది కదా అని అంటుంది వసు. అప్పుడు వసుధార నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావేంటి వాడు స్నేహానికి ద్రోహం చేశాడు అని అంటాడు రిషి.

అప్పుడు పరిస్థితులను మనం అంచనా వేయలేం కదా సార్ అనడంతో ఏ పరిస్థితులలో ఉండవచ్చు. వాడు స్నేహితుడు కదా మరి ఎలా మోసం చేస్తాడు అని అంటాడు రిషి. అప్పుడు వసుధార ఎంత చెప్పినా కూడా రిషి మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా గౌతమ్ నా దగ్గర నిజం దాచడం చాలా పెద్ద తప్పు అని అంటాడు రిషి. మరొకవైపు దేవయాని కోపంతో రగిలిపోతూ అటు ఇటు తిరుగుతూ వెళ్లిపోయింది అనుకున్నా జగతి మళ్ళీ వచ్చింది. రిషి ని తన వైపుకు తిప్పుకుంటోంది. ఏదో ఒకటి చేయాలి వీళ్ళ ఆగడాలు కూడా ఎక్కువ అవుతున్నాయి అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది దేవయాని. ఇంతలోనే వసుధార రిషి ఇంటికి వస్తారు. 
 

అప్పుడు రిషి కోపంగా పైకి వెళ్ళిపోగా దేవయాని వసుధార ని వెళ్లకుండా అడ్డుకుంటుంది. అప్పుడే వచ్చేశారు మీరు తెల్లవారిన తర్వాత వస్తారు అనుకున్నానే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళారా అయినా ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది దేవయాని. అప్పుడు వసుధార ఇప్పుడు రిషి సార్ ఉన్న పరిస్థితుల్లో ఈమెను నేను ఏమి అనకపోవడమే మంచిది సార్ ఇబ్బందుల్లో పడతాడు అనుకుంటూ ఉంటుంది. అదే అదునుగా భావించిన దేవయాని గురించి నోటికొచ్చిన విధంగా వాగుతూ ఉంటుంది.
 

తర్వాత రిషి రూమ్ కి వెళ్ళగా మహేంద్ర పడుకుని ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెంటనే మహేంద్ర రిషి లోపలికి రా అని పిలుస్తాడు. మహేంద్ర ఏంటి రిషి అవతారం ఏంటి రిషి అని అనగా షర్టు పాడైంది గౌతమ్ దగ్గరికి వెళ్లాను నా మనకి పాడయింది అని అంటాడు రిషి. అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రిషి అనడంతో గౌతమ్ ఇంట్లో మీరు ఉండడం గురించి డాడ్ అని అంటాడు రిషి. నాకు తెలిసిపోయింది డాడ్ అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. నేను మీరు ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని అడగలేదు మీరు కూడా చెప్పలేదు కానీ గౌతమ్ నా చిన్నప్పటి ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు కూడా నా దగ్గర నిజం దాచాడు అని అంటాడు రిషి.
 

అప్పుడు మహేంద్ర అసలు విషయం చెప్పబోతుండగా అప్పుడు రిషి ఒక ఫ్రెండ్ ని మోసం చేయడం క్షమించరాని నేరం అని అంటాడు. అప్పుడు రిషి, మహేంద్ర ముందు గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా గౌతమ్ ని అపార్థం చేసుకుంటూ ఉంటాడు రిషి. నేను ఎప్పటికీ గౌతమ్ ని క్షమించలేను అని అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా గౌతమ్ ని అపార్థం చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర బాధపడుతూ కారణాలు ఏవైనా నేను ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జగతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేనే వినకుండా వెళ్ళిపోయాను అని అంటాడు మహేంద్ర. గౌతమ్ నన్ను ఆశ్రయించాడు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు పాపం రిషి గౌతం అని అంటాడు. చెప్పినా గౌతమ్ నిజం దాచడం చాలా పెద్ద తప్పు డాడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.

click me!