Guppedantha Manasu: వసుపై గౌతమ్ ప్రేమ.. అది చూసి కోపంతో రగిలిపోతున్న రిషి!

Navya G   | Asianet News
Published : Dec 16, 2021, 11:42 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతుంది. రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: వసుపై గౌతమ్ ప్రేమ.. అది చూసి కోపంతో రగిలిపోతున్న రిషి!

గౌతమ్ (Gautham), రిషి కారులో వెళ్తూ ఉండగా గౌతమ్ పదేపదే వసు గురించి మాట్లాడుతాడు. అంతలోనే తనకు వసు కనిపించడంతో రిషిని కారు ఆపమని చెప్పి వసు (Vasu) దగ్గరికి వెళ్లి వసుతో మాట్లాడుతాడు. వసుని చూసి రిషి షాక్ అవుతాడు.
 

28

ఇక గౌతమ్ తన ఫ్రెండ్ కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పి రమ్మంటాడు. మొదట వసు (Vasu) రానని చెబుతోంది. వెంటనే రిషిని చూసి.. తనపై రిషి (Rishi) కి ఎటువంటి కోపం ఉందో తెలుసుకోవడానికి ఓకే అంటుంది. వెంటనే గౌతమ్ వచ్చి రిషిని అడగటం తో ఓకే అనేస్తాడు.
 

38

రిషి (Rishi) తన మనసులో వాడు రమ్మనగానే రావడమేనా అని కోపంతో రగిలిపోతాడు. ఇక గౌతమ్ రిషిని వసుకు పరిచయం చేస్తాడు. ఇక వసును తన పేరు అడగడంతో రిషి వసు (Vasu) పేరు చెబుతాడు. గౌతమ్ షాక్ అవ్వగా వసు సార్ వాళ్ళ కాలేజీలో చదువుకుంటున్నానని చెబుతుంది.
 

48

ఇక గౌతమ్ (Gautham) ఇంకా మురిసిపోతాడు. రిషి కి థాంక్స్ చెబుతాడు. గౌతమ్ వసుతో ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు రిషికి మండిపోతుంది. ఇక వసును (Vasu) మామూలుగా ఫ్రెండ్ లాగా పిలుస్తాను అని అనడంతో రిషి తన మనసులో వద్దు వద్దు అని అనుకుంటాడు.
 

58

ఇటువంటి పిలుపులోనే కాకుండా కోపాల వల్ల కూడా  దూరంగా ఉంటారని రిషిని (Rishi) ఉద్దేశించి మాట్లాడుతుంది.  రిషికి కోపం రావడం తో కావాలని కారును స్పీడుగా తీసుకెళ్తాడు. దాంతో వసు (Vasu), గౌతమ్ ఇద్దరూ ఒకరికొకరు తగులుకుంటారు. ఇక రిషికి ఇంకా మండిపోతుంది.
 

68

గౌతమ్ (Gautham) మాత్రం తెగ సంతోషంగా ఫీల్ అవుతాడు. నా సెలక్షన్ సూపర్ అని అనుకుంటాడు. వసుకు ఇష్టమైనా  వాటి గురించి అడుగుతాడు. కావాలని రిషి గురించి అబద్ధాలు మాట్లాడుతుంటాడు. వెంటనే రిషి (Rishi) కోపం తో రగిలిపోతాడు.
 

78

ఇక రెస్టారెంట్ దగ్గరికి చేరుకోగానే తనతో కాఫీ తాగుతానని, తనతో వెళ్తానని బతిమాలుతాడు. రిషి వద్దని అనడంతో ఊరుకుంటాడు. ఇక వసు (Vasu) కూడా గౌతమ్ కు లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ చెబుతుంది. రిషి (Rishi) కారు నాది అని అనడంతో లిఫ్ట్ ఇచ్చింది ఆ సర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
 

88

జగతి (Jagathi)రెస్టారెంట్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని బాధపడుతుంది. మహేంద్ర వర్మ కు రిషి అర్థం చేసుకునే విధానంలో పొరపాటు పడుతున్నాడని ఎలాగైనా నువ్వే చూసుకోవాలి అని చెబుతోంది. తరువాయి భాగం లో ధరణి (Dharani) వసు కి ఫోన్ చేసిందని తెలియటంతో రిషి వసు వినాలని కోపంగా మాట్లాడతాడు.

click me!

Recommended Stories