Keerthy Suresh photos: స్పెయిన్ లో మహేష్ హీరోయిన్ అందాలు చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న 'మహానటి'

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 16, 2021, 10:45 AM IST

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి.

PREV
16
Keerthy Suresh photos: స్పెయిన్ లో మహేష్ హీరోయిన్ అందాలు చూశారా.. మెస్మరైజ్ చేస్తున్న 'మహానటి'

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 

26

నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. 

36

కీర్తి సురేష్ ప్రస్తుతం స్పెయిన్ వెకేషన్ లో ఉంది. అక్కడ సరదాగా గడుపుతున్న ఫొటోస్ ని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది.సింపుల్ గా గాగుల్స్ ధరించి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది కీర్తి. 

46

కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

56

మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనితో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు. 

66

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. ఈ ఏడాది కీర్తి సురేష్ రంగ్ దే, అన్నాత్తే చిత్రంలో మెరిసింది. 

 

click me!

Recommended Stories