Gaurav Gupta: బిగ్‌ బాస్‌ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌరవ్‌ గుప్తా బ్యాక్‌ గ్రౌండ్ ఇదే.. విలన్‌గానే ఉండిపోతాడట

Published : Oct 13, 2025, 12:14 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 వైల్డ్ కార్డ్‌ ఎంట్రీలో భాగంగా టీవీ యాక్టర్‌ గౌరవ్‌ గుప్తా హౌజ్‌లోకి వచ్చాడు. తాను బిగ్‌ బాస్‌ షోలో కూడా విలన్‌గా ఉంటానంటోన్న గౌరవ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటో తెలుసుకుందాం. 

PREV
13
టీవీ నటుడు గౌరవ్‌ బిగ్‌ బాస్‌ 9 హౌజ్‌లోకి ఎంట్రీ

బిగ్‌ బాస్‌ తెలుగు 9 ఐదో వారం ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రమ్య మోక్ష, దివ్వెల మాధురీ, నిఖిల్‌ నాయర్‌, ఆయేషా జీనత్‌, శ్రీనివాస సాయితోపాటు నటుడు గౌరవ్‌ గుప్తా కూడా ఉన్నారు. మోడల్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి, యూట్యూబర్‌గా పాపులర్‌ అయ్యాడు గౌరవ్‌. ఆ తర్వాత సీరియల్స్ తో గుర్తింపు పొందాడు. నెగటివ్‌ రోల్స్ తో ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు బిగ్‌ బాస్‌ షోలోకి చివరి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. సీరియల్స్ లోనే కాదు, తాను బిగ్‌ బాస్‌ షోలో కూడా విలన్‌గానే మారతానని చెప్పడం మరో విశేషం.

23
కన్నడ నుంచి వచ్చిన గౌరవ్‌

మరి బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన గౌరవ్‌ గుప్తా బ్యాక్‌ గ్రౌండ్ ఏంటి? అనేది చూస్తే, గౌరవ్‌ ది కర్నాటక. ఇప్పుడు చాలా వరకు బిగ్‌ బాస్‌ షోలోకి వస్తున్నది కన్నడ ఆర్టిస్ట్ లే కావడం గమనార్హం. గత కొన్ని సీజన్లుగా వారి డామినేషన్‌ కనిపిస్తోంది. ఇప్పుడు కూడా వాళ్ల డామినేషనే ఉంది. అందులో భాగంగా బెంగుళూరుకి చెందిన గౌరవ్‌ బీ టెక్‌ చేశాడు. ఆ సమయం నుంచి మోడలింగ్‌ లోకి అడుగుపెట్టాడు, బాగా రాణించారు. యూట్యూబ్‌ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

33
`గీతా ఎల్‌ ఎల్‌ బీ`తో పాపులర్‌ అయిన గౌరవ్‌

మోడలింగ్‌ నుంచి నటుడిగా మారాడు గౌరవ్‌ గుప్తా. 2019లో `లాహిరి లాహిరి లాహిరిలో` సీరియల్‌తో నటుడిగా టర్న్ తీసుకున్నాడు. ఇది స్టార్‌ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఇది గౌరవ్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత తమిళంలో `ఉయిరే` అనే సీరియల్‌లో నటించాడు. అక్కడ కూడా ఫర్వాలేదనిపించాడు. అట్నుంచి తన సొంత భాష కన్నడలో `దొరసానే` అనే సీరియల్‌లో నటించాడు. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్‌తో తెలుగులో `మళ్లీ`, `గీతా ఎల్‌ ఎల్‌బీ` సీరియల్స్ లో నటించాడు. హీరోగా, విలన్‌గానూ కనిపించాడు. అయితే `గీతా ఎల్‌ఎల్‌బీ` మంచి గుర్తింపు తెచ్చింది. దీంతో సినిమాల్లోనూ ప్రయత్నాలు చేశారు. కానీ స్ట్రగుల్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు బిగ్‌ బాస్‌ షో ద్వారా పాపులర్‌ మరింత పాపులర్‌ కావాలని, సినిమా, టీవీ అవకాశాలను దక్కించుకోవాలని బిగ్‌ బాస్‌ షోకి రావడం విశేషం. మరి ఆయన హౌజ్‌లో ఏమేరకు ఆకట్టుకుంటాడో, కంటెంట్ ఇస్తాడో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories