Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఆదివారం రోజు డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఫ్లోరా షైనీతో పాటు శ్రీజ దమ్ము కూడా ఎలిమినేట్ అయింది. అయితే శ్రీజ ఎలిమినేషన్ ప్రక్రియ క్రేజీగా సాగింది.
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా సండే రోజు ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అయేషా జీనత్, సాయి, దివ్వల మాధురి, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళ ఎంట్రీ తో రెండు ఎలిమినేషన్స్ కూడా జరిగాయి. డబుల్ ఎలిమినేషన్ తో షాకిచ్చారు. ముందుగా ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ వచ్చాక దమ్ము శ్రీజ ఎలిమినేషన్ జరిగింది.
24
డేంజర్ జోన్ లో శ్రీజ, సుమన్ శెట్టి
దమ్ము శ్రీజ ఎలిమినేషన్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులతోనే ప్లాన్ చేశారు. అన్ని టాస్కులలో సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా శ్రీజ, సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఉండిపోయారు అని నాగార్జున అన్నారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులు డిసైడ్ చేస్తారు అని నాగార్జున అన్నారు. సుమన్ శెట్టి దగ్గర బ్లూ కలర్ బెలూన్స్.. శ్రీజ దగ్గర ఎల్లో కలర్ బెలూన్స్ ఉంచారు. వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులు ఒక్కొకరుగా వచ్చి.. శ్రీజ, సుమన్ లలో ఎవరు ఎలిమినేట్ కావాలని భావిస్తే వారి బెలూన్ ని కట్ చేయాలి. కారణం చెప్పాలి అని నాగార్జున అన్నారు.
34
వైల్డ్ కార్డు ఎంట్రీ సభ్యులతో ఎలిమినేషన్ ప్రక్రియ
ముందుగా అయేషా వచ్చారు. ఆమె శ్రీజ బెలూన్ ని కట్ చేశారు. శ్రీజ కంటే సుమన్ శెట్టి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ అని, ఆయనతో కలిసి హౌస్ లో ఉండాలని కోరుకుంటున్నట్లు అయేషా పేర్కొంది. ఆ తర్వాత సాయి.. సుమన్ శెట్టి బెలూన్ తొలగించారు. సుమన్ కంటే శ్రీజ గేమ్ బాగా ఆడుతుందని సాయి తెలిపారు. దివ్వల మాధురి, నిఖిల్ నాయర్, రమ్య మోక్ష వీళ్లంతా శ్రీజ బెలూన్స్ నే తొలగించారు.
దివ్వల మాధురి.. శ్రీజ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ప్రతి విషయంలో అనవసరంగా వేలు పెడుతుందని, అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుందని మాధురి తెలిపింది. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మాట్లాడుతూ.. శ్రీజ కంటే సుమన్ మాట్లాడే విధానం బావుంటుంది అని పేర్కొంది. మొత్తంగా సుమన్ కంటే శ్రీజ బెలూన్స్ తగ్గిపోయాయి. దీనితో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత శ్రీజ వేదికపైకి వెళ్లి కంటెస్టెంట్స్ కి కొన్ని సలహాలు ఇచ్చి వెళ్ళిపోయింది.