తిరుపతి లడ్డుపై కార్తీ షాకింగ్ కామెంట్స్

First Published | Sep 24, 2024, 6:26 AM IST

ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టూ భయంకరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, సౌత్ స్టేట్స్ అనే తేడా లేకుండా అందరూ తిరుమల లడ్డూపై స్పందిస్తున్నారు. 


ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం కంటిన్యూ అవుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకపంనలు ఇంకా తగ్గలేదు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించారంటూ ఆరోపణలు చేసారు.  

NDDB CALF  ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో.. సోయాబీన్, పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది. కాగా  NDDB CALF ల్యాబ్ కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందింది.  ఈ నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ విన్నా లడ్డు గురించే వార్తలు, డిస్కషన్స్ జరుగుతున్న నేపధ్యంలో తమిళ స్టార్ హీరో కార్తీ ని ఈ లడ్డు విషయమై స్పందించమని మీడియావారు కోరటం జరిగింది. దానికి ఆయన ఏమన్నారో చూద్దాం. 


తమిళ స్టార్  హీరో కార్తీ (Karthi) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ‘ఆవారా’ (Awara) ‘ఖైదీ’ (Kaithi) ‘సర్దార్’ (Sardar) వంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలసిందే.  అయితే గత ఏడాది వచ్చిన ‘జపాన్’ (Japan) నిరాశపరిచింది.

ఇక ఈ సెప్టెంబర్ 28 కి ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. తమిళ 96 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) అదే చిత్రాన్ని ‘జాను’ గా తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలో తెలుగులో ప్రమోషన్ నిమిత్తం ఆయన హైదరాబాద్ వచ్చారు. 



 కార్తి హీరోగా నటించిన “సత్యం సుందరం” సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా ఈ డైలాగ్ వాడారు.  లడ్డూ కావాలా నాయనా అనేది ఫేమస్ డైలాగ్. కొన్ని ‘ప్రత్యేక’ సందర్భాల్లో ఈ డైలాగ్ చాలా పాపులర్.దీని చుట్టూ చిన్న క్వశ్చన్ ప్లాన్ చేశారు. కానీ కార్తి మాత్రం సుతారంగా నో చెప్పాడు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. నాకు లడ్డూ వద్దు.” అంటూ స్పందించాడు కార్తి. సరదాగా స్పందించమని యాంకర్ కోరగా.. అస్సలు లడ్డూ వద్దు అంటూ కరాఖండిగా చెప్పేశాడు.

Karthi


ప్రస్తుతం తిరుమల లడ్డూ చుట్టూ భయంకరమైన వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు, సౌత్ స్టేట్స్ అనే తేడా లేకుండా అందరూ తిరుమల లడ్డూపై స్పందిస్తున్నారు. ఏకంగా కేంద్రం కూడా ఈ వివాదంపై దృష్టి పెట్టింది. దీంతో లడ్డూ ఇష్యూ ఇప్పుడు జాతీయ అంశంగా మారింది. ఇలాంటి సెన్సిటివ్ టైమ్ లో లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ ప్రశ్న అడగడంతో కార్తి స్పందించడానికి తిరస్కరించాడు. చూస్తుంటే, కార్తి కరెంట్ ఎఫైర్స్ బాగానే ఫాలో అవుతున్నారని అందరూ అంటున్నారు.
 

Meiyazhagan

 
కార్తీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ....‘96’ విజయం తర్వాత ప్రేమ్‌కుమార్‌ నుంచి వస్తున్న చిత్రమిది. ఆయన ఈ స్క్రిప్ట్‌ను అద్భుతమైన నవలలా రాశారు. ఇది చదువుతున్నప్పుడు చాలా చోట్ల ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. ఇలాంటి కథ ఎలా రాస్తారనిపించింది. నాకు కె.విశ్వనాథ్‌ చిత్రాలంటే బాగా ఇష్టం. కానీ, అలాంటి కథలు ఇప్పుడు రావడం లేదు. ఈ కథ విన్నప్పుడు అలాంటి ఒక మంచి సినిమా అవుతుందనిపించింది. చాలా అరుదైన స్క్రిప్ట్‌ ఇది. అన్నయ్య సూర్య ఈ కథ విని ‘నీకు మాత్రమే ఇలాంటి కథలు ఎలా వస్తున్నాయ’ని అన్నారు’’. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Meiyazhagan review out Karthi film is emotional


అలాగే ‘‘సోదరుల్లాంటి రెండు పాత్రల మధ్య నడిచే కథ ఇది. ‘96’లాగే ఒక్క రాత్రిలో జరిగే కథగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది. ‘సాగర సంగమం’ చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలుగుతుందో..  అలాంటి మంచి అనుభూతినే ఈ చిత్రంతో ఆస్వాదిస్తారు ప్రేక్షకులు. మన సంస్కృతికి.. మూలాలకు సంబంధించిన సినిమా. ఇలాంటి కథ అరవింద్‌ స్వామి నిజ జీవితంలో జరిగిందని తెలిసి ఆశ్చర్యపోయా. దీంట్లో ఆయన పాత్రలో తనని తప్ప మరొకర్ని ఊహించలేం. మా పాత్రల మధ్య కెమిస్ట్రీ మనసుల్ని హత్తుకుంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

Latest Videos

click me!