ఆసుపత్రిలో గంగవ్వ... ఆమెకు ఏమీ కాకూడదంటూ ఫ్యాన్స్ ప్రార్థనలు!

First Published | Feb 23, 2021, 3:04 PM IST

గంగవ్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రికి వెళ్లడం జరిగింది. తాను చికిత్స తీసుకుంటున్న విషయాన్ని గంగవ్వ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

అరవై ఏళ్ల గంగవ్వ యూట్యూబ్ సెలెబ్రెటీగా పేరుగాంచారు. ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు విడుదల చేసి ఫ్యాన్స్ ని సంపాదించారు.
యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫేమ్ తో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ వయసులో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక షోలో తన మార్కు గేమ్ మరియు మాటల పంచ్ లతో గంగవ్వ అలరించారు. ప్రేక్షకుల నుండి అత్యధిక ఓట్లు గంగవ్వ పొందడం జరిగింది. అయితే గంగవ్వ అనారోగ్య కారణాలతో హౌస్ నుండి బయటికి వచ్చేశారు.
బిగ్ బాస్ తరువాత ఆమె పాపులారిటీ రెట్టింపు అయ్యింది. ఆమె యూట్యూబ్ ఛానల్ మరింతగా ప్రేక్షకులకు చేరువయ్యింది. ఇక రెమ్యూనరేషన్ పరంగా కూడా గంగవ్వ బాగానే దక్కించుకున్నారు.
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన డబ్బులతో గంగవ్వ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. దాదాపు రూ. 20లక్షల వ్యయంతో గంగవ్వ తన ఇంటి నిర్మాణం చేపట్టారు.
ఇటీవల బిగ్ బాస్ ఉత్సవంలో పాల్గొన్న గంగవ్వకు తోటి కంటెస్టెంట్స్ బహుమతులు ఇచ్చారు. ఆ వేడుకలో గంగవ్వ ఉత్సాహంగా పాల్గొన్నారు.
సడన్ గా గంగవ్వ ఆసుపత్రిలో కనిపించడం ఆమె ఫ్యాన్స్ ని కంగారును గురి చేసింది. అయితే గంగవ్వ మోకాళ్ళ నొప్పుల చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తుంది.
మోకాళ్ళ నొప్పుల కోసం ఆమె ఆయుర్వేద వైద్యం చేయించుకున్నారు.  ఆయుర్వేద వైద్యశాలలో ఉన్న గంగవ్వ తన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకొవడం జరిగింది.
ఆ ఫోటో చూసిన అభిమానులు.. గంగవ్వకు ఏమీ కాకూడదు, గంగవ్వ నువ్వు బాగుండాలని కామెంట్స్ పెడుతున్నారు.

Latest Videos

click me!