Published : Mar 24, 2022, 03:49 PM ISTUpdated : Mar 24, 2022, 03:50 PM IST
ఢీ లేటెస్ట్ (Dhee show)ఎపిసోడ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జడ్జి గణేష్ మాస్టర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న రైతుకు ఆర్థిక సహాయం చేశారు.
దేశానికి వెన్నెముక రైతు అంటారు. అయితే ఆ రైతుల జీవితాలు మాత్రం చాలా దుర్భరం. పంట చేతికొచ్చే దాకా నానా కష్టాలు పడతారు. తీరా పండిన పంటకు గిట్టుబాటు ధర ఉండదు. అప్పు సొప్పు చేసి వ్యవసాయం చేస్తే.. కష్టాలు తీరతాయనే గ్యారంటీ ఉండదు. ఏడాదికి వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
26
Ganesh master
కష్టమైనా నష్టమైనా భూమితల్లిని నమ్ముకున్న కర్షకులు వ్యవసాయాన్ని మాత్రం వదలరు. కాగా అంజయ్య అనే రైతు పూర్తిగా రెండు కాళ్ళు పోగొట్టుకొని కూడా వ్యవసాయం వదల్లేదు. అంగవైకల్యంతో కూడా ధాన్యం పండించి దేశానికి ఆహారం అందిస్తున్నారు. సదరు రైతును ఢీ షోలో పరిచయం చేశారు.
36
Ganesh master
ఆయన జీవిత కథను వేదికపై ఆవిష్కరించారు. అంజయ్య సైతం పాట చివర్లో వేదికపైకి వచ్చారు. ఆయన దీన గాథ షోలో ఉన్నవారందరిచేత కంటతడి పెట్టించింది. వికలాంగుడైన రైతు అంజయ్య కథ తెలుసుకొని జడ్జి గణేష్ మాస్టర్ చలించి పోయారు. ఆయనకు ఆర్థిక సహాయంగా తన రెండు ఎపిసోడ్స్ పారితోషికం ప్రకటించారు.
46
Ganesh master
గణేష్ మాస్టర్ (Ganesh master)ఔదార్యానికి అందరూ మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో అంజయ్య లాంటి రైతుల పట్టుదల, స్ఫూర్తికి ఫిదా అవుతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
56
Ganesh master
గతంలో కూడా గణేష్ మాస్టర్ ఓ కంటెస్టెంట్ కి ఆర్థిక సహాయం చేశారు. ఢీ 13లో తండ్రి లేని ఓ కంటెస్టెంట్ అప్పుల బాధల గురించి తెలుసుకొని దాదాపు నాలుగు లక్షల ఆర్థిక సహాయం చేశారు. మరి గణేష్ మాస్టర్ తన సంపాదనలో ఇలా సమాజ సేవకు కేటాయిస్తున్నారు.
66
Ganesh master
ఇక ఢీ లాంటి షోలలో ఇలాంటి సామాజిక సమస్యలు లేవనెత్తడం మెచ్చుకోవాల్సిన పరిణామం. ఈ కార్యక్రమం ద్వారా వికలాంగుడైన రైతు అంజయ్య గురించి ప్రభుత్వాలకు, ఇతరులకు తెలిసింది. ఆ రైతుకు సామాజిక స్పృహ ఉన్నారువారు మరికొందరు ఆర్థిక సహాయం చేసే అవకాశం కలదు.