ఆమెకి స్వాగతం పలుకుతూ రోజా, ఆమనిలు కలిసి డాన్సులు చేయడం హైలైట్‌గా నిలిచింది. ముగ్గురూ చూడముచ్చటగా ఉన్నారు. ఈ సందర్భంగా లైలా నవ్వులు షోకి హైలైట్‌గా నిలిచాయి. అప్పుడు ఇప్పుడు అంతే అందంగా ఉండగా, ఏమాత్రం తరగని అందంతో కనువిందు చేయడం విశేషం. అయితే తనో జడ్జెస్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి, తన వద్ద ఉన్న టిప్స్ అనీ వాళ్లకి ఇద్దామనుకుంటున్నా అని రోజా అనగా, ఆమని స్పందించింది. తాను కూడా చేరిపోతానని వెల్లడించింది. దీనికి రోజా రియాక్ట్ అవుతూ, ఆల్‌రెడీ జడ్జ్ గా సూపర్‌గా చేస్తున్నావ్‌గా కదా మళ్లీ ఎందుకొచ్చావని రోజా ప్రశ్నించగా, నేను బాగా చేస్తే ఆవిడ(లైలా)ని ఎందుకు పిలుస్తారని బుంగమూతి పెట్టింది ఆమని. ఇది నవ్వులు పూయించింది. ఇందులో లైలా నవ్వులు హైలైల్ అయ్యాయి.