గేమ్‌ ఛేంజర్‌ v/s దేవర.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మధ్య బిగ్‌ ఫైట్‌కి ప్లాన్‌?.. నిజమైతే దుమారమే!

Published : Apr 02, 2024, 09:37 PM ISTUpdated : Apr 02, 2024, 10:33 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో మధ్యలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ భీకరంగా కొట్టుకుంటారు. స్నేహం కాస్త శతృత్వంగా మారుతుంది. కానీ ఇదే ఇప్పుడు రియల్ గా జరగబోతుందని తెలుస్తుంది.   

PREV
18
గేమ్‌ ఛేంజర్‌ v/s దేవర.. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ మధ్య బిగ్‌ ఫైట్‌కి ప్లాన్‌?.. నిజమైతే దుమారమే!

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు తారక్‌. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఆయన్నుంచి సినిమా రాలేదు. సోలో హీరోగా వచ్చి ఆరేళ్లు అవుతుంది. దీంతో `దేవర`తో సోలోగా బాక్సాఫీసుని షేక్‌ చేయాలని చూస్తున్నారు. కొరటాల కూడా ఈ మూవీని అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

28

తండ్రికొడుకుల కథతో సినిమా సాగుతుందట. పోర్ట్ ని తండ్రి నిర్మించగా, ప్రత్యర్థులు కుట్ర చేసి ఆ పోర్ట్ ని లాగేసుకుంటారు. దీంతో కొడుక్కి ఈ విషయం తెలిసి ఆ పోర్ట్ ని స్వాధీనం చేసుకునేందుకు చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తుంది. దేవాగా, వరగా తారక్‌ కనిపిస్తారని సమాచారం. ఆయనకు జోడీగా ఇందులో జాన్వీ కపూర్‌ కనిపిస్తుంది. తండ్రి పాత్రకి మరాఠి నటి నటిస్తుందని తెలుస్తుంది. ఫహద్‌ ఫాజిల్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన పాత్రలు పోషిస్తారని సమాచారం. 
 

38

`దేవర` సినిమాని కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్‌ 5నే విడుదల కావాల్సి ఉంది. కానీ వర్క్ కంప్లీట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్ కారణంగా డిలే అవుతుందని అక్టోబర్‌కి మార్చారు. దసరాకి అక్టోబర్‌ 10న విడుదల చేయాలని భావిస్తున్నారు. బాగా టైమ్‌ ఉండటంతో సినిమాపై మరింత బాగా వర్క్ చేస్తున్నారట. పోస్ట్ ప్రొడక్షన్‌ విషయంలో రాజీపడకుండా, అలాగే సీన్ల విషయంలో రాజీపడకుండా ప్లాన్‌ చేస్తున్నారట కొరటాల. 
 

48

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌తో రామ్‌ చరణ్‌ ఫైట్‌ చేయబోతున్నారట. ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరగబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో మొదట్నుంచి స్నేహంగా ఉన్న ఈ ఇద్దరు మధ్యలో భీకరంగా కొట్టుకుంటారు. ఇప్పుడు అదే సందర్భం చోటు చేసుకోబోతుందట. మరి ఆ వివరాలే ఇప్పుడు షాకిస్తున్నాయి. ఇద్దరు ఫ్యాన్స్ ని కలవర పెడుతున్నాయి. మరి ఈ కొట్లాట కథేందనేది చూస్తే..
 

58
game changer

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరో షెడ్యూల్‌ షూట్‌ చేస్తే సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చేసి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీని శంకర్‌ ఓ క్రేజీ డేట్‌కి ఫిక్స్ చేయబోతున్నారట. అదే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది. 
 

68

`గేమ్‌ ఛేంజర్‌` రిలీజ్‌ డేట్‌పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. శంకర్‌ సినిమా ఎప్పుడు ఫినీష్‌ చేస్తాడు, ఎప్పుడు ఫైనల్‌ టచ్‌ ఇస్తాడు అనేది ఎవరికీ తెలియదు. నిర్మాత దిల్‌ రాజు చేతిలోనూ లేదు. అందుకే రిలీజ్‌ డేట్‌పై ఎలాంటి స్పష్టత లేదు. అయితే తాజాగా ఓ కొలిక్కి వచ్చిందట.రిలీజ్‌ డేట్‌పై శంకర్‌ నుంచి ఓ క్లారిటీ వచ్చిందట. ఈ మూవీని అక్టోబర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. అయితే అక్టోబర్‌లో దసరానే టార్గెట్‌ చేస్తున్నారని తెలుస్తుంది. 
 

78

ఇదే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది. ఎందుకంటే అక్టోబర్‌లో దసరాకి ఆల్‌ రెడీ `దేవర` ఫిక్స్ అయి ఉన్నాడు. దీంతోపాటు నాగచైతన్య `తండేల్‌` కూడా డేట్‌ కన్ఫమ్‌ చేసుకుంది. దీంతో దసరాకి అంటే ఇక బాక్సాఫీసు వద్ద యుద్ధమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `ఆర్‌ఆర్‌ఆర్‌`లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌.. రామ్‌, భీమ్‌లుగా కొట్టుకున్నారు. ఇప్పుడు చూడబోతుంటే, వాళ్లిద్దరి సినిమాలు బాక్సాఫీసు వద్ద కొట్టుకోబోతున్నారని, ఇది పరోక్షంగా ఇద్దరి మధ్యఫైట్‌లాగే ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

88
Game Changer 2

ఇక రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌`లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, నవీన్‌ చంద్ర, సునీల్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. రిలీజ్‌ అక్టోబర్‌లో అనుకుంటున్నారనేది ఒక టాక్‌ అయితే అక్కడ పాజిబుల్‌ లేకపోతే డిసెంబర్‌ కి వెళ్లిపోతుందని టాక్‌. మరి ఏం జరుగుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories