pawan kalyan, #Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్టు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక ‘ గేమ్ ఛేంజర్ ‘ లో తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఇక ఈ సినిమాతో ఇలాగూన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని మరో సారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే హైదరాబాద్ లో జరుపుతారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ముంబై, లక్నో ,బీహార్ ఇలాంటి చోట్ల ప్లాన్ చేస్తున్నారు.తెలుగు సినిమా స్థాయి, ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో దానికి తగ్గట్టే పుష్ప 2 వంటి సినిమాలు చిత్ర టీమ్ దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ విదేశంలో ముందస్తు విడుదల వేడుక జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నిలవనుంది.
యు.ఎస్.ఎ. (కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, టెక్సాస్)లో డిసెంబరు 21 (Game Changer Pre Release Event Date) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర టీమ్ తాజాగా ప్రకటించింది. చాలా సినీ టీమ్ లు విదేశాలకు వెళ్లి తమ చిత్రాన్ని ప్రచారం చేశాయిగానీ ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. ఏదైమైనా ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ టీమ్ మరో అడుగు ముందుకేసింది.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
వచ్చే ఏడాది జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమాని విడుదల చేయనున్న నేపథ్యంలో టీమ్ ఇప్పటికే ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇటీవల లఖ్‌నవూలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. త్వరలో చెన్నైలోనూ ఓ వేడుక ఏర్పాటు చేయనుంది.
జనవరి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ఓ ప్రెస్‌మీట్ తెలిపారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను గురువారం పూర్తి చేసిన ఎస్.జె. సూర్య.. ‘‘అవుట్‌పుట్ చూస్తే.. దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది’’ అంటూ అభిమానుల అంచనాలు రెట్టింపు చేశారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’లో హీరో రామ్ చరణ్ (Ram Charan) ద్విపాత్రాభినయం చేశారు. రాజకీయ నాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా కొత్త కోణాల్ని ఆవిష్కరించనున్నారు. కియారా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్‌గా మెరవనున్న ఈ పాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, ఎస్.జె.సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకుని నిర్మిస్తున్న చిత్రం ఇది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. శ్రీకాంత్, అంజలి, ఎస్.జే.సూర్య, సునీల్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
#Shankar, #GameChanger, #RamCharan, #KiaraAdvani
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు రూ.30 నుంచి రూ.40 కోట్లు తీసుకునే చరణ్.. ఈ చిత్రానికి భారీగానే కోట్ చేసారట. అయితే దిల్ రాజు ఓ ప్రపోజల్ పెట్టారట. నిర్మాతగా తను, హీరో, డైరక్టర్ ముగ్గరూ 33% చొప్పున సమానంగా షేర్ బిజినెస్ నుంచి తీసుకుందామనుకున్నారు. ఈ బిజినెస్ లో థియేటర్, డిజిటల్, శాటిల్, మిగతా అన్ని రైట్స్ ఉంటాయి. ఇలా చేయటం వల్ల శంకర్ కు, హీరో రామ్ చరణ్ కు ఇమ్మీడియట్ గా రెమ్యునరేషన్ లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఆ డబ్బుని సినిమాలో పెట్టుబడిగా పెట్టవచ్చు అనుకున్నారు.
read more: సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్ బ్రాండ్
also read: మంచు లక్ష్మీ చెయ్యాల్సిన రెండు సినిమాలు అనుష్కకు, రెండు బ్లాక్ బస్టర్లే