సినిమాల్లోకి రోజా రీఎంట్రీ.. ఎలాంటి రోల్స్ చేయాలని ఉందో మనసులో మాట బయటపెట్టిన ఫైర్‌ బ్రాండ్

First Published | Nov 23, 2024, 4:25 PM IST

మాజీ మంత్రి రోజా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన ప్లాన్‌ చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆ విషయాన్ని వెల్లడించింది రోజా. 
 

మాజీ మంత్రి రోజా ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలను ఊపేసిన హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్న టాప్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకటేష్‌తో సహా, జగపతిబాబు, రాజశేఖర్‌, రాజేంద్రప్రసాద్‌లతోనూ కలిసి నటించారు. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పారు, నెమ్మదిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రోజా.  

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

ప్రారంభంలో నగరి నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. టీడీపీ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యేగా గెలిచింది. చివరగా ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీ ప్రభుత్వంలో, వైఎస్‌ జగన్‌ సారథ్యంలో మంత్రిగా సేవలందించింది. కానీ ఈ సారి ఆమె ఓడిపోయింది.

దీంతో ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది రోజా. దీంతో ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెడుతుంది. రీఎంట్రీకి ప్లాన్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఆమె రీఎంట్రీని ప్రకటించింది. సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది. 
 


అయితే తనకు హుందాగా, పవర్‌ఫుల్‌గా ఉండే పాత్రలు చేయాలని ఉందని చెప్పింది. `బాహుబలి`లో రమ్యకృష్ణలా, `సరిలేరు నీకెవ్వరు`లో విజయశాంతి, `అత్తారింటికి దారేదీ`లో నదియాలా మంచి స్ట్రాంగ్‌ రోల్స్ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది రోజా. ఇలాంటి బలమైన పాత్రలు చేయడానికి సిద్ధమే అని తెలిపింది.

ఆ దిశగా మేకర్స్ పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. అటు తన నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తూనే సినిమాలు కూడా చేయాలనుకుంటున్నట్టు చెప్పింది రోజా. మొత్తానికి థర్డ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిపింది. అయితే ఇంకా ఏ మూవీకి ఒప్పుకోలేదని, మంచి సినిమాతో రీఎంట్రీ ప్లాన్‌ చేస్తున్నట్టు చెప్పింది. 

రోజా 1991లో `ప్రేమ తపస్సు` సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. రాజేంద్రప్రసాద్‌ నటించిన ఈ చిత్రంతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత `చెంబుర్తి` సినిమా ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ సినిమాలతో రాణిస్తూ తక్కువ సమయంలో బిజీ అయిపోయింది.

స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. శోభన్‌బాబుతో `సర్పయాగం` చిత్రంలోనూ నటించింది. దాదాపు పదేళ్లు హీరోయిన్‌గా బిజీగా ఉంది. ఏడాదికి ఆరేడు సినిమాలతో తీరిక లేకుండా ఉంది. తెలుగు, తమిళంలోనే కాదు, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసింది రోజా. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 
 

jabardasth show

మళ్లీ 2010లో `శంభో శివ శంభో` సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. `గోలిమార్‌`, `మొగుడు`, `పరమవీర చక్ర`, `శ్రీరామరాజ్యం`, `పవిత్ర` వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత సినిమాలకు కూడా బ్రేక్‌ ఇచ్చింది. ఎమ్మెల్యే అయ్యాక ఆమె సినిమాలు మానేసింది. జబర్దస్త్ కామెడీ షో చేసి మెప్పించింది. జడ్జ్ గా దాదాపు ఏడెనిమిదేళ్లు పనిచేసింది, అలరించింది. తెలుగు, తమిళంలో అనేక షో చేసింది. మంత్రి అయ్యాక ఆమె షోస్‌ కూడా మానేసింది. ఇప్పుడు ఖాళీ కావడంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది రోజా. 

read more:పవన్‌ కళ్యాణ్‌ హీరోయిన్‌ దేవయాకి ఇన్ని ఆస్తులున్నాయా? లగ్జరీ కార్స్, హౌజ్‌, ఫామ్‌ హౌజ్.. లిస్ట్ పెద్దదే

also read: మహేష్‌, రామ్‌ చరణ్‌ దగ్గర్లో కూడా లేరు, ప్రభాసే ఇండియాలో నెంబర్ వన్‌.. తారక్, బన్నీ ఎక్కడంటే?

Latest Videos

click me!