`గేమ్‌ ఛేంజర్‌` అసలు స్టోరీ ఇదే, వీక్‌ పాయింట్స్, హైలైట్స్ ఏంటి? బజ్‌ లేకపోవడానికి కారణమేంటి?

First Published | Jan 9, 2025, 8:34 PM IST

రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ స్టోరీ తెలిసిపోయింది. అలాగే మూవీలో వీక్‌ పాయింట్స్‌, హైలైట్స్ ఏంటో లీక్ అయ్యాయి. అవేంటో చూద్దాం. 
 

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ మరికొన్ని గంటల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది? ఎలాంటి రికార్డులు క్రియేట్‌ చేస్తుంది? హిట్‌ అవుతుందా? నిరాశ పరుస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో `గేమ్‌ ఛేంజర్‌` కథేంటనేది అందరిలోనూ ఉన్న క్యూరియాసిటీ. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇది రివేంజ్‌ డ్రామా అని టాక్‌. తండ్రిని కుట్ర చేసి చంపేస్తే వారిపై కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కథ అని తెలుస్తుంది. చూడబోతుంటే బాహుబలిని తలపించేలా ఉంటుందట.

తండ్రి అప్పన్న(పెద్ద రామ్‌ చరణ్‌) పేదల కోసం పనిచేసే నాయకుడు. ప్రజల మధ్యలో ఉంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఇతర రాజకీయ నాయకుల అరాచకాలను, అన్యాయాలను ప్రశ్నిస్తాడు. కొత్తగా పార్టీ పెడతాడు. రాజకీయంగా ప్రత్యర్థులకు అడ్డుగా మారతాడు. దీంతో ఆయన్ని చంపేసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేస్తారు. మొత్తానికి చంపేస్తారు. 
 


అయితే నమ్మిన వ్యక్తితోనే హత్యచేయిస్తారని తెలుస్తుంది. అప్పన్న భార్య అంజలి. ఆమెకి ఈ రాజకీయ కుట్రలన్నీ తెలుసు. కొడుకు రామ్‌ నందన్‌ ఐఏఎస్‌గా ఎంట్రీ ఇస్తాడు. రాజకీయ నాయకుల కుట్రను బయటకు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగుతాడు.

వారిని ఎలా ఎదుర్కొన్నాడనేది సినిమా. మరి అప్పన్నని చంపింది ఎవరనేది మిస్టరీ. ఆ పాత్రలో శ్రీకాంత్‌ కనిపిస్తారని తెలుస్తుంది. అలాగే రాజకీయ కుట్రలు చేసే విలన్‌గా ఎస్‌ జే కనిపిస్తారట. 

read more: కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్: ప్రారంభంలోనే ఎందుకు ఆగిపోయింది?
 

సినిమా మొదటి భాగం రొటీన్‌గా ఉంటుందట. రామ్‌ నందన్‌ పాత్ర ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ఆయన లవ్‌ ట్రాక్, కాలేజీ ఎపిసోడ్‌, అలాగే సివిల్స్ లో రాణించడం ఐఏఎస్‌ కావడం ఉంటాయి. ఆయా ఎపిసోడ్లు రెగ్యూలర్‌గానే ఉంటాయని తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో అప్పన్న పాత్ర ఎంట్రీ ఉంటుంది.

అది ఫ్లాష్‌ బ్యాక్. ఇదే సినిమాకి ఆయువు పట్టు అని టీమ్‌ నమ్ముతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మదర్‌ సెంటిమెంట్‌ హైలైట్‌గా నిలుస్తుందట. కానీ అది వర్కౌట్‌ అవుతుందా? అనేది డౌట్‌. వర్క్ అయితే సినిమా జనాలకు ఎక్కుతుందని, లేదంటే డిజాస్టర్‌ ఖాయమంటున్నారు. మరి శంకర్‌ వాటిని ఎంత వరకు డీల్‌ చేశాడనేది చూడాలి. 
 

శంకర్‌ ఒకప్పుడు సంచలనాలు సృష్టించారు. ఇండియన్‌ సినిమాని షేక్‌ చేశారు. పాన్‌ ఇండియా సినిమాలతో అదరగొట్టారు. ఇండియన్‌ మేటి డైరెక్టర్‌గా రాణించారు. కానీ ఇటీవల ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. `ఐ` మూవీ నుంచి కాస్త డౌన్‌ అయ్యారు. `2.0` తో కూడా అంతగా మెప్పించలేకపోయాడు. `భారతీయుడు 2` పూర్తిగా నిరాశ పరిచాడు.

ఇప్పుడు `గేమ్‌ ఛేంజర్‌`ని ఎలా డీల్‌ చేశాడనేది పెద్ద ప్రశ్న. పాటలు ఆకట్టుకున్నాయి. విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటాయి. కానీ హంటింగ్‌ చేసేలా లేవు. విడుదలైన టీజర్, టైలర్లు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాపై బజ్‌ని క్రియేట్‌ చేయలేకపోతున్నాయి. శంకర్‌ సినిమా అనేసరికి ఓ నిరాశ స్టార్ట్ అవుతుంది.

ఈ నేపథ్యంలో సినిమాపై అనేక అనుమానాలు ఉన్నాయి. దిల్‌రాజు చెప్పినట్టు రామ్‌ చరణ్‌ అనేది యూఎస్‌పీ. ఆయన ఏ మేరకు ఆకట్టుకుంటాడు. నెగటివిటీని ఆయన పటాపంచలు చేయబోతున్నాడా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు జనవరి 10న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  దిల్‌ రాజు ఈ మూవీని సుమారు రూ.450కోట్ల భారీ బడ్జెట్‌

read more: దిల్ రాజుకి 'అరుంధతి' ఒక పీడకల..పెట్టిన డబ్బంతా పోయింది, 300 కోట్ల బడ్జెట్ వరకు ఎలా ఎదిగారంటే

also read: మాట తప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి, తెలంగాణలో `గేమ్‌ ఛేంజర్‌` టికెట్ రేట్లు పెంపు, ఎంత పెరిగాయంటే?

Latest Videos

click me!