హీరోయిన్‌ సైజులపై త్రినాథ రావు నక్కిన వల్గర్‌ కామెంట్లు, మహిళా కమిషన్‌ సీరియస్‌, సారీ చెప్పిన దర్శకుడు

First Published | Jan 13, 2025, 3:13 PM IST

తెలుగు ఆడియెన్స్ సైజులు ఎక్కువ కావాలంటూ హీరోయిన్‌ దర్శకుడు త్రినాథరావు నక్కిన వల్గర్‌ కామెంట్లని మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుందట. 
 

దర్శకుడు త్రినాథ రావు నక్కిన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. `మన్మథుడు` హీరోయిన్‌ అన్షుపై ఆయన `మజాకా` టీజర్‌ ఈవెంట్‌లో చేసిన వల్గర్‌ కామెంట్లు పెద్ద వివాదంగా మారాయి. తాజాగా అటు టాలీవుడ్‌ని, ఇటు సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. ఓ సీనియర్‌ హీరోయిన్‌పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 
 

సందీప్‌ కిషన్‌ హీరోగా రీతూ వర్మ హీరోయిన్‌గా `మజాకా` మూవీ రూపొందుతుంది. ఇందులో రావు రమేష్‌, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బెజవాడ ప్రసన్న కుమార్‌ రైటర్‌. ఈ మూవీ టీజర్‌ ఈవెంట్‌ ఆదివారం(జనవరి 12)న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. 
 


హీరోయిన్‌ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్టుగా యాక్ట్ చేసి, వాటర్‌ అడుతూ అల్లు అర్జున్‌పై సెటైర్లు పేల్చారు. అసలే ఆ వివాదం స్టేట్‌ మొత్తాన్ని ఊపేసింది. అయినా దానిపై దర్శకుడు ఇలాంటి కామెంట్‌ చేయడంతో అదో వివాదంగా మారింది. అంతేకాదు మరో అడుగు ముందుకేశాడు దర్శకుడు. `మన్మథుడు` ఫేమ్‌ అన్షుపై వల్గర్ కామెంట్‌. ఆమె సన్నగా ఉందని, తెలుగు ఆడియెన్స్ కి సైజులు కావాలని, తెలుగు వాళ్లకి సైజులు కావాలని తిని లావు అవ్వు అమ్మా అని చెప్పినట్టుగా మాట్లాడాడు. దీంతో ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 

దర్శకుడు త్రినాథరావుని ఆడుకుంటున్నారు. ట్రోల్‌ చేస్తున్నారు. దర్శకుడు తాగి ఈవెంట్‌ కి వచ్చాడా? సక్సెస్‌ తలకెక్కిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది సోషల్‌ మీడియాలో నానా రచ్చ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీన్ని మహిళా కమిషన్‌ కూడా సీరియస్‌గా తీసుకుందట. దీనిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టు తెలిపారు. 
 

తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్మెన్‌ నేరేళ్ల శారదా స్పందిస్తూ, త్రినాథ రావు నక్కిన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరిస్తామని తెలిపారు. త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పరిగనించబోతున్నామని వెల్లడించింది. ఇది ప్పుడు మరింత రచ్చ కాబోతుంది. మొత్తానికి దర్శకుడు నోటీ దూల ఇప్పుడు ఆ మూవీని వివాదంలో పడేసింది. దర్శకుడిపై అంతా మండిపడుతున్నారు. దారుణమైన కామెంట్లతో ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. 
 

దీంతో దిగొచ్చిన దర్శకుడు త్రినాథ రావు దీనిపై వివరణ ఇచ్చారు. క్షమాపణలు చెప్పారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షు గారికి, మరియు నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను, నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా` అంటూ వీడియో విడుదల చేశారు త్రినాథ రావు నక్కిన.  

read more: హీరోయిన్ ను అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ పై సెటైర్లు వేసిన డైరెక్టర్, సంచలనంగా మారిన వ్యాఖ్యలు

also read: బాలకృష్ణతో విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ ముద్దులాట.. `డాకు మహారాజ్‌` సక్సెస్‌ పార్టీలో రెచ్చిపోయిన హీరోలు

Latest Videos

click me!