`డాకు మహారాజ్‌` ఫస్ట్ డే కలెక్షన్లు, చిరంజీవి రికార్డులు బ్రేక్.. బాలయ్య దెబ్బ మామూలుగా లేదుగా!

First Published | Jan 13, 2025, 5:04 PM IST

బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్‌` సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. అయితే ఫస్ట్ డే ఈ మూవీ భారీ కలెక్షన్లని సాధించింది. తన రికార్డులను బ్రేక్‌ చేసింది. 

నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `డాకు మహారాజ్‌` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో ఆయన ఆడియెన్స్‌ ని అలరిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆదివారం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. ఫస్ట్ షో నుంచే సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. కథ పరంగా పెద్దగా కొత్తగా లేకపోయినా మాస్‌ ఆడియెన్స్ ని, ఫ్యాన్స్ కి అలరిస్తుంది. 
 

ముఖ్యంగా సినిమాలో బాలయ్య క్యారెక్టర్ ఎలివేషన్లు హైలైట్‌గా నిలిచాయి. ప్రతి పది ఇరవై నిమిషాలకు ఆయన ఎంట్రీతో అదరగొట్టారు బాబీ. ఫ్యాన్స్ కి ఏవైతే కావాలో అవన్నీ జోడించారు. ఫ్యామిలీ ఎలిమెంట్లు, పాప సెంటిమెంట్లు, అదిరిపోయే యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లతో అందరికి కావాల్సిన అంశాల సమాహారంగా మూవీని తెరకెక్కించారు.

కథ పరంగా కొత్తగా లేకపోయినా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అదే ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్. కామెడీ ఎలిమెంట్లు లేవు, ఆ లోటు కనిపిస్తుంది. క్లైమాక్స్ ని, సెకండాఫ్‌ని మరింత రక్తికట్టేలా డిజైన్‌ చేస్తే బాగుండేది. 
 


అయినా సంక్రాంతి కావడంతో సినిమాకి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా `డాకు మహారాజ్‌` సంచలనంగా మారింది. కేవలం తెలుగులోనే(పాన్‌ ఇండియా కాకుండా) విడుదలైన ఈ మూవీ మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లని సాధించింది.

ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఏకంగా రూ.56కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇటీవల పలు సినిమాల యూనిట్స్ ప్రకటించిన కలెక్షన్ల పరంగా చాలా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో `డాకు మహారాజ్‌` కలెక్షన్లలో నిజం ఎంతా అనేది చూడాలి. 
 

కానీ ఓ రిజినల్‌ లాంగ్వేజ్‌లో విడుదలైన మూవీకి ఈ రేంజ్‌ కలెక్షన్లు అంటే మామూలు విషయం కాదు, ఇది పెద్ద రేంజ్‌ సినిమా కాబోతుందని చెప్పొచ్చు. ఇక `డాకు మహారాజ్‌` మూవీ రూ.83కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో థియేటర్‌లోకి వచ్చింది. మొదటి రోజే సుమారు ముప్పై కోట్ల షేర్‌ సాధించడం విశేషం.

ఈ వీక్‌ మొత్తం సినిమాలకు మంచి ఆదరణ దక్కుతుంది. బాగున్న సినిమాలను జనం బ్రహ్మరథం పడతారు. కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ లెక్కన ఇది రెండు వందల కోట్ల గ్రాస్‌ కి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఈ మూవీకి లాంగ్‌ రన్‌ ఉంటుంది. 
 

ఇక బాలయ్య ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో తన తోటి హీరో అయిన చిరంజీవి సినిమా రికార్డులను బ్రేక్‌ చేశారు. ఆయన నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ఫస్ట్ డే 55 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఆ మూవీ రికార్డుని బాలకృష్ణ `డాకు మహారాజ్‌` బ్రేక్‌ చేసింది. దీంతోపాటు తన రికార్డులను బ్రేక్‌ చేశారు. `వీరసింహారెడ్డి` రూ.48కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డుని `డాకు మహారాజ్‌` బ్రేక్‌ చేసింది.  

read more: తల లేని మనిషి కథతో ‘డాకు మహారాజ్‌’ ప్రీక్వెల్‌ ప్రకటన
 

బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో ఆయనకు జోడిగా ప్రగ్యా జైశ్వాల్‌ నటించింది. బాబీ డియోల్‌ విలన్‌గా చేశారు. ఆయనకు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్‌ కనిపించింది. ఊర్వశీ రౌతేలా పోలీస్‌ పాత్రలో కాసేపు మెరిసింది.

నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆదివారం భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సినిమాల హిట్‌తో జోరు మీదున్న బాలయ్య అకౌంట్‌లో మరో హిట్‌ గ్యారంటీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

read more:బాలకృష్ణతో విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డ ముద్దులాట.. `డాకు మహారాజ్‌` సక్సెస్‌ పార్టీలో రెచ్చిపోయిన హీరోలు

also read: హీరోయిన్‌ సైజులపై త్రినాథ రావు నక్కిన వల్గర్‌ కామెంట్లు, మహిళా కమిషన్‌ సీరియస్‌, సారీ చెప్పిన దర్శకుడు

Latest Videos

click me!