OTT లో 'విడుదల 2' స్ట్రీమింగ్‌ డేట్, ప్లాట్ ఫామ్

First Published | Jan 7, 2025, 9:33 AM IST

విజయ్ సేతుపతి, సూరి నటించిన 'విడుదల 2' ఓటీటీలో విడుదల కానుంది. జనవరి 17న జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.  

‘మహారాజా’ సక్సెస్ తో జోరుమీదున్నారు  విజయ్‌ సేతుపతి. రీసెంట్ గా ఆయన  నుంచి వచ్చిన కొత్త సినిమా ‘విడుదల పార్ట్‌ 2’. గతంలో విజయం సాధించిన ‘విడుదల పార్ట్‌ 1’కు కొనసాగింపుగా వెట్రిమారన్‌ తెరకెక్కించారు. (viduthalai part 2) మంజు వారియర్, సూరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ రెండో భాగం అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. దాంతో ఫస్ట్ పార్ట్ చూసిన  చాలా మంది ఓటిటిలో చూడాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేఫథ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ బయిటకు వచ్చాయి. 

విజయ్‌ సేతుపతి, సూరి లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.  వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్‌ 1’ చిత్రం 2023లో రిలీజ్‌ కాగా తమిళ్, తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్‌ ‘విడుదల 2’ తెరకెక్కించారు.

విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు. విడుదలై 2 బాక్సాఫీస్‌ వద్ద ఊహించనంతగా మెప్పించలేదు. దీంతో  మినిమం కలెక్షన్స్‌ కూడా సాధించలేకపోయింది. 

read more: `చంద్రముఖి` నిర్మాతలు నయనతారని 5 కోట్లు డిమాండ్‌ చేశారా? అసలు నిజం ఏంటి? నిర్మాతల వివరణ
 


Viduthalai 2

 మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ  భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే, ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది.  

2025 జనవరి 17వ తేదీన ‘విడుదల 2’ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చే ప్లాన్‌లో జీ5 ఉన్నట్లు తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు వర్షన్స్‌ రెండూ ఒకే రోజు అందుబాటులోకి రానున్నట్లు చెప్తున్నారు. అయితే,  ఈ విషయంలో 'జీ5' ఓటీటీ నుంచి అఫీషియల్  ప్రకటన రావాల్సి ఉంది.  

Viduthalai 2 trailer

 కథేంటంటే: కానిస్టేబుల్‌ కుమరేశన్‌ (సూరి) ఇచ్చిన క్లూతో ప్రజాదళం నాయకుడు, నక్సల్‌ పెరుమాళ్‌ అలియాస్‌ మాస్టార్‌ (విజయ్‌ సేతుపతి)ని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ‘విడుదల 1’ను ముగించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే ఈ చిత్ర రెండో భాగం మొదలైంది.

పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్‌ పెరుమాళ్‌ జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాల్ని అడ్డుకునే క్రమంలో దళ నాయకుడిగా ఎలా మారాడు? ఈ ఉద్యమ ప్రయాణంలో మహాలక్ష్మి (మంజు వారియర్‌)తో చిగురించిన ప్రేమ తనని ఏ వైపు నడిపించింది? 
 

Viduthalai 2

 అహింసను ఇష్టపడే పెరుమాళ్‌ తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? నీతి నిజాయితీలతో ఉద్యోగ ధర్మం నిర్వర్తించి పెరుమాళ్‌ను పట్టించినందుకు కానిస్టేబుల్‌ సూరికి ఎలాంటి ఫలితం దక్కింది?అనే ఆసక్తికర ప్రశ్నలతో ఈ ‘విడుదల 2’ కథ సాగింది.

మరి వీటికి దర్శకుడు వెట్రిమారన్‌ (viduthalai part 2 director) చూపించిన సమాధానాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

read more: అమీర్‌ ఖాన్‌తో శివ కార్తికేయన్‌ మూవీ.. నిన్న లోకనాయకుడు, ఇప్పుడు మిస్టర్‌ పర్‌ఫెక్ట్

also read: ప్రభాస్‌ కి పోటీగా అజిత్‌.. `గుడ్ బ్యాడ్ అగ్లీ' కొత్త రిలీజ్‌ డేట్‌

Latest Videos

click me!