చాలా కాలంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న యాక్షన్ డ్రామా 'టాక్సిక్' 2025లో విడుదల కానుంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం లో వెంకట్ కె. నారాయణ్ నిర్మించిన ఈ మూవీ హై-ఆక్టేన్ కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ₹300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'టాక్సిక్' ఇప్పటి వరకూ ఉన్న సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసే ఆలోచనలో ఉంది.
ఈ సినిమాలో యష్ తో పాటు సాయి పల్లవి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, సంయుక్త మీనన్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. స్టార్ సీనియర్స్ అంతా ఈ సినిమాలో నటిస్తుండటంతో్.. ఈమూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
టాక్సిక్ సినిమా లో నటించినందుకు గాను హీరోగా యష్‌కి ₹50 కోట్ల భారీ పారితోషికం ఇచ్చారని తెలుస్తోంది. కెజియఫ్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యిచాలా కాలం అవుతున్నా.. యష్ కు ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి.
యష్ తర్వాత, నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమాలో మరో నటుడిగా ఉన్నాడు. ఆయన , తన పాత్రకు గాను ఈసినిమా కోసం ₹3 కోట్లు తీసుకున్నారుౌని సమాచారం.
సంయుక్త మీనన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దానికి ఆమెకు ₹1 కోటి రెమ్యునరేషన్ ముట్టినట్టు తెలుస్తోంది. షైన్ టామ్ చాకో, డాలి ధనంజయ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరికి వరుసగా ₹40 లక్షలు, ₹35 లక్షలు ఇచ్చారట.