మేనేజర్ తో పడుకుంటే బంపర్ ఆఫర్.. నా మైండ్ దొబ్బింది, గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్

Published : Jun 03, 2022, 07:42 AM IST

చిత్తూరు యాసలో అద్భుతంగా డైలాగులు చెబుతూ ఆకట్టుకుంటోంది గలాటా గీతూ అలియాజ్ గీతూ రాయల్. చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికి నటన పరంగా నేను అప్పటికి సిద్ధంగా లేను.

PREV
16
మేనేజర్ తో పడుకుంటే బంపర్ ఆఫర్.. నా మైండ్ దొబ్బింది, గలాటా గీతూ షాకింగ్ కామెంట్స్

చిత్తూరు యాసలో అద్భుతంగా డైలాగులు చెబుతూ ఆకట్టుకుంటోంది గలాటా గీతూ అలియాజ్ గీతూ రాయల్. చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికి నటన పరంగా నేను అప్పటికి సిద్ధంగా లేను. దీనితో ఆ చిత్రాలని నో చెప్పానని గీతూ అన్నారు. అయితే కొన్ని చిన్న సినిమాల్లో ఆమె నటించారు. 

26

ప్రస్తుతం గీతూ జబర్దస్త్ లో లేడి కమెడియన్ గా నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి గీతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని గీతూ పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఓ ఈవెంట్ ని హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. నాకు హోస్టింగ్ అంటే ఇష్టం. మంచి రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని చెప్పారు. దీనితో ఓకే అని చెప్పాను. 

36

ఆ ఈవెంట్ మూడు రోజుల పాటు జరుగుతుంది. తీరా టికెట్స్ బుక్ చేసే సమయానికి వాళ్ళ వ్యక్తి ఒకరు ఫోన్ చేశారు. మేడం మీకు పర్సనల్ గా ఓకే కదా అని అడిగారు. నేను తప్పుగా అర్థం చేసుకోకుండా.. నాకు హెల్ప్ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్ ని పెడతారేమో అనుకుని ఓకె అన్నాను. అతడు మరోసారి క్లారిటీ ఇస్తూ.. మేనేజర్ తో మీకు పర్సనల్ ఓకే అయితే రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. 

46

దీనితో అతడి మాటలకు నా మైండ్ దొబ్బింది. దీనితో వెంటనే కుదరదు అని ఫోన్ పెట్టేశాను. కానీ పర్సనల్ గా ఇష్టం లేకుంటే సరే.. కనీసం హోస్టింగ్ అయినా చేయండి అంటూ వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ నాకు చాలా భయం వేసింది. రిస్క్ ఎందుకని ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అని గీతూ పేర్కొంది. 

56

ఇక తాను అల్లు అర్జున్ అభిమానిని అని పేర్కొంది. అల్లు అర్జున్ అంటే చేయి కోసుకుంటాను. తన అసలు పేరు గ్రీష్మ గీతిక లేఖ అని గీతూ రివీల్ చేసింది. గీతికని గీతూగా మార్చుకున్నాను. అప్పటి నుంచి నాకు బాగా కలసి వస్తోంది అని గీతూ పేర్కొంది. 

66

తన చిత్తూరు జిల్లా యాసని ప్రమోట్ చేయడం కోసమే తాను ఈ స్లాంగ్ లో మాట్లాడుతున్నాను అని గీతూ అన్నారు. నేను నార్మల్ గా కూడా మాట్లాడగలను. కానీ నా ప్రాంతాన్ని ప్రమోట్ చేయడం కోసం చిత్తూరు యాస ఎంచుకున్నాను. అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి అని గీతూ పేర్కొంది. 

click me!

Recommended Stories