Vikram Review: 'విక్రమ్' ప్రీమియర్ షో టాక్.. కమల్ హాసన్ ఈజ్ బ్యాక్..

Published : Jun 03, 2022, 06:28 AM IST

ప్రతిభావంతుడైన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తుండడడంతో విక్రమ్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి మొదలయింది. నేడు ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.

PREV
17
Vikram Review: 'విక్రమ్' ప్రీమియర్ షో టాక్.. కమల్ హాసన్ ఈజ్ బ్యాక్..

ప్రతిభావంతుడైన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తుండడడంతో విక్రమ్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి మొదలయింది. నేడు ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.ఇప్పటికే యూఎస్, చెన్నై లాంటి ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా చూస్తున్న ప్రీమియర్స్ నుంచి ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. 

27

మంచి ఇంట్రడక్టన్ సన్నివేశంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తారు. కమల్ పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో ఇంట్రడక్షన్ లోనే చెప్పేస్తారు. స్టైలిష్ యాక్షన్ కి లోకేష్ కనకరాజ్ పెట్టింది పేరు. విక్రమ్ చిత్రం కూడా అదే తరహాలో మొదలవుతుంది. 

37

ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా మొదలైనప్పటికీ అక్కడక్కడా వచ్చే థ్రిల్స్ మెప్పిస్తాయి. విజయ్ సేతుపతి ఇంట్రడక్షన్ అయితే అదిరిపోతుందనే చెప్పాలి. అద్భుతంగా విజయ్ పాత్రని లోకేష్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ చిత్రంలో కార్తీ ఖైదీ మూవీ కథ, పాత్రలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో విక్రమ్ చూసే ముందు.. ఖైదీ చూసి  వెళ్లడం బెటర్. 

47

ఫస్ట్ హాఫ్ ని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంగేజింగ్ గా తీర్చిదిద్దారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ కి అయితే థియేటర్ లో పూనకాలే అంటున్నారు ప్రేక్షకులు. బెస్ట్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ గా చెబుతున్నారు. అయినప్పటికీ లోకేష్ పూర్తి కథని ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ చేయడం లేదు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. 

57

విక్రమ్ అసలు సిసలైన లోకేష్ కనకరాజ్ మూవీ అని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాటోగ్రఫీ ప్రతి షాట్ లో కట్టిపడేసే విధంగా ఉంది. ఇక అనిరుద్ కూడా బిజియంతో చెలరేగిపోయాడు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ విక్రమ్ చిత్రం ఓవరాల్ గా బావుందని అంటున్నారు. 

67

తీవ్రమైన వైలెన్స్.. ప్రాస్టిట్యూషన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభంలో మళ్ళీ సినిమా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత ట్విస్టులు రివీల్ కావడంతో వేగం పుంజుకుంటుంది. 

77

లోకేష్ కనకరాజ్ అద్భుతమైన యాక్షన్, థ్రిల్స్, ట్విస్ట్ లతో మాయ చేసారు అనే చెప్పాలి. లోకేష్ దర్శకత్వానికి కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ల అద్భుతమైన నటన తోడైంది. ఓవరాల్ గా విక్రమ్ వికస్వరూపం ప్రదర్శించాడు అని అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉండబోతోందో చూడాలి.

click me!

Recommended Stories