గబ్బర్ సింగ్ ఫేమ్ రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రమేష్ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు. దీనితో కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత అంత్యాక్షరి గ్యాంగ్ కి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. కామెడీ విలన్లుగా అనేక చిత్రాల్లో నటించారు. అంత్యాక్షరి గ్యాంగ్ లో రమేష్ కూడా ఒకరు. గబ్బర్ సింగ్ తర్వాత గబ్బర్ సింగ్ రమేష్ గా పాపులర్ అయ్యాడు. అతడి గురించి ఆందోళన కలిగించే వార్త ఇది. గబ్బర్ సింగ్ రమేష్ బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు.
24
అపోలో ఆసుపత్రిలో చికిత్స
రమేష్ ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ స్ట్రోక్ అని తేలడంతో అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం రమేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అపోలో వైద్యులు తెలిపినట్లు సమాచారం.
34
విషమంగా ఆరోగ్య పరిస్థితి
ప్రస్తుతం రమేష్ కి ఐసీయూలో నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు క్లోజ్ గా రమేష్ ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ మూవీలో రమేష్, ఇతర గ్యాంగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రమేష్ తన కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. పైగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో అంత్యాక్షరి గ్యాంగ్ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
గబ్బర్ సింగ్ తర్వాత రమేష్ అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, రామయ్య వస్తావయ్యా, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా అనేక చిత్రాల్లో నటించారు. తన ప్రతి సినిమా షూటింగ్ అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రమేష్ యాక్టివ్ గా ఉండేవారు. అలాంటి రమేష్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ తో విషమ ఉన్నారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. రమేష్ త్వరగా కోలుకుని క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో రమేష్ ఏపీలో జనసేన తరుపున ప్రచారం కూడా చేశారు. గబ్బర్ సింగ్ గ్యాంగ్ మొత్తం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.