విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన `ఫంకీ` మూవీ థియేటర్లో సందడి చేస్తుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ఇమేజ్‌ని, జోనర్‌ని పక్కన పెట్టి చేసిన మూవీ `ఫంకీ`. అనుదీప్ కేవీ దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందించారు. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. డైలాగ్ కామెడీతో సాగే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. కథ లేదని, కథనం సరిగా లేదని, ఎడిటింగ్ లోపాలున్నాయనే విమర్శలు వచ్చాయి. డైలాగ్ కామెడీ కొంత వరకే ఆకట్టుకుందనే కామెంట్స్ వచ్చాయి.
25
టాక్‌తో సంబంధం లేకుండా `ఫంకీ` కలెక్షన్లు
ఓవరాల్‌గా `ఫంకీ` చిత్రానికి మిశ్రమ స్పందన కంటే నెగటివ్ టాకే ఎక్కువగా వినిపించింది. కొందరు మాత్రమే ఎలాంటి లాజిక్కులు పట్టించుకోకుండా చూస్తే నవ్వుకునే మూవీ అవుతుందన్నారు. అయితే టాక్‌తో సంబంధం లేకుండా మూవీ దూసుకుపోతుంది. మొదటి రోజు మాత్రం మంచి వసూళ్లని రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. తెలుగు స్టేట్స్ లో కూడా ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చాయి. ఇటీవల విశ్వక్ సేన్‌కి మార్కెట్ తగ్గిపోయింది, అనుదీప్ కూడా యాక్టివ్‌గా లేరు. ఇలాంటి సమయంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన `ఫంకీ` చిత్రానికి మంచి వసూళ్లు రావడం విశేషం.
35
ఫంకీ మూవీ కలెక్షన్లు
`ఫంకీ` మూవీ మొదటి రోజు ఊహించని వసూళ్లని రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ.4.5కోట్లు వచ్చాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.2.65కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1.15కోట్లు వచ్చాయి. విశ్వక్ సేన్ నటించిన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`, `గామి`, `ధమ్కీ` వంటి చిత్రాలు ఎనిమిది కోట్లకుపైగా మొదటి రోజు కలెక్షన్లని సాధించాయి. వాటితో పోల్చితే ఈ మూవీకి చాలా పూర్ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. కానీ రీసెంట్ మూవీస్ `మెకానిక్ రాకీ`కి రూ.2.6కోట్లు, `లైలా`కి రూ.1.8కోట్లు వచ్చాయి. వాటితో పోల్చితే, ఈ మూవీకి వచ్చిన టాక్ తో పోల్చితే మాత్రం మంచి వసూళ్లనే `ఫంకీ` రాబట్టిందని చెప్పొచ్చు. అనుదీప్ మీద ఉన్న క్రేజ్‌తో ఇది సాధ్యమైందని టాక్. ఓ రకంగా అనుదీప్ వల్ల విశ్వక్ సేన్‌కి జాక్ పాట్ తగిలింది.
మొత్తంగా రెండున్నర కోట్ల షేర్ ని సాధించింది. ఈ మూవీ సుమారు రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. దీనికి రిలీజ్‌కి ముందు రూ.13కోట్ల బిజినెస్ అయ్యింది. సినిమా హిట్ కావాలంటే రూ.27కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాలి. మరి ఇప్పుడున్న టాక్‌తో ఈ రేంజ్ వసూళ్లని రాబడుతుందా అనేది చూడాలి. శనివారం, ఆదివారం, సోమవారం శివరాత్రి ఈ మూవీకి కలిసి రాబోతున్నాయి. మరి ఏ మేరకు సినిమా ఆకట్టుకుంటుంది, సక్సెస్ అవుతుందో చూడాలి.
55
ఫంకీ మూవీ కథేంటంటే?
`ఫంకీ` మూవీ సినిమా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో హీరో కోమల్ అనే సినిమా దర్శకుడిగా కనిపిస్తాడు. ఆయన నాలుగు కోట్లతో సినిమా తీస్తానని నిర్మాతగా మూవీ స్టార్ట్ చేస్తాడు. కానీ రాను రాను అది నలభై కోట్లు అవుతుంది. దీంతో నిర్మాత షాక్ అవుతాడు. మూవీని మధ్యలోనే ఆపేస్తాడు, ఇతర దర్శకులతో మూవీని కంప్లీట్ చేయాలని నిర్మాత కూతురు కయాదు లోహర్ రంగంలోకి దిగుతుంది. ఏ డైరెక్టర్ ఈ మూవీ చేయడానికి ముందుకు రారు, దీంతో కోటీ రూపాయలతో మూవీ కంప్లీట్ చేసేలా విశ్వక్‌సేన్‌తోనే మళ్లీ కమిట్ అవుతారు. మరి కోటీలోనే మూవీ కంప్లీట్ అయ్యిందా?. ఈ క్రమంలో విశ్వక్, కయాదు ఎలా ప్రేమలో పడ్డారనేది మూవీ.