ప్రేమికుల రోజు సందర్భంగా తెలుగు నుంచి రెండు క్రేజీ సినిమాలు వచ్చాయి. విశ్వక్ సేన్ నటించిన `ఫంకీ`, సంతోష్ శోభన్, మానస వారణాసి నటించిన `కపుల్ ఫ్రెండ్లీ`. ఈ సినిమాల బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉందంటే?
విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన `ఫంకీ` మూవీ గత వారం విడుదలైంది. అనుదీప్ రూపొందించిన ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. కామెడీ వర్కౌట్ కాలేదనే టాక్ వినిపించింది. అయితే ప్రారంభంలో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. మరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ చిత్రం ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందనేది చూస్తే.
25
ఫంకీ మూవీ కలెక్షన్లు
ఈ మూవీకి మొదటి రోజు నాలుగున్నర కోట్ల గ్రాస్ వచ్చింది. అనుదీప్ మూవీ కావడం, విశ్వక్ సేన్, కయాదు లోహర్ వంటి క్రేజీ జంట నటించడంతో సినిమాకి మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయి. కానీ రెండో రోజు నుంచే తగ్గిపోయింది. క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇక ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ.11కోట్ల రేంజ్‌లో వసూళ్లని రాబట్టింది. ఐదున్నర కోట్ల షేర్‌ని వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.14కోట్లు. ఇంకా ఎనిమిది కోట్లకుపైగా షేర్‌ని రాబట్టాలి. అంటే పదహారు కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేయాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
35
కపుల్ ఫ్రెండ్లీ మూవీ రిజల్ట్
ఇక దీనికి పోటీగా వచ్చిన మరో సినిమా `కంపుల్ ఫ్రెండ్లీ`. ఇది ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇందులో సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించారు. అశ్విన్ చంద్రశేఖర్ రూపొందించారు. యూవీ కాన్సెప్ట్స్ నిర్మించారు. అజయ్ నిర్మాత. ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫ్రెష్ లవ్ స్టోరీగా విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఆ జోరు కనిపించలేదు. ప్రారంభంలో శనివారం, ఆదివారం బాగానే జోరు చూపించిన ఈ చిత్రం ఇప్పుడు డల్ అయిపోయింది.
`కపుల్ ఫ్రెండ్లీ` చిత్రం ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు సుమారు ఆరున్నర నుంచి ఏడు కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. మూడున్నర కోట్ల షేర్‌ని సాధించింది. ఈ మూవీ సేఫ్ కావాలంటే ఆరున్నర కోట్లు రావాలి. అంటే ఇప్పుడు సగం వచ్చాయి. ఇంకా మూడు కోట్లు రావాలి. అంటే ఇంకా ఆరు కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ వారం నడిస్తే, ఇదే జోరు కనిపిస్తే సేఫ్ అవుతుంది. లేదంటే కొంత నష్టాలు తప్పవు.
55
ఫంకీకి, కపుల్ ఫ్రెండ్లీ షాక్
అయితే `ఫంకీ`తో పోల్చితే `కపుల్ ఫ్రెండ్లీ` తక్కువ నష్టంతో ముగిస్తుందని చెప్పొచ్చు. కానీ బాగా ఆడితే మాత్రం సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు. థియేట్రికల్‌గా మంచి స్కోప్ ఉంది. ఆ ఛాన్స్ ఉంది. కానీ `ఫంకీ` మూవీకి ఆ స్కోప్ కనిపించడం లేదు. ఈ మూవీ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. లక్షల్లో వసూళ్లు వస్తున్నాయి. అవి కూడా క్రమంగా పడిపోతున్నాయి. ఈ రోజు, రేపటితో ఈ మూవీ థియేట్రికల్‌గా ముగింపు పలికే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది విశ్వక్ సేన్, అనుదీప్, నాగవంశీలు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.