Peddi:RRR సినిమా తర్వాత ప్యాన్ ఇండియా వైడ్‍గానే కాకుండా ప్యాన్ వరల్డ్ లో తెలుగు సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే రామ్ చరణ్ (పెద్ది) సినిమా చూసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చేంతలా...ఇంతకీ జపాన్ నుంచి ఎవరు వచ్చారో తెలుసా?
హీరో ఫ్యాన్స్ అంటే ఫస్డ్ డే ఫస్ట్ షో, ప్రీమియం షోలు చూడటం, సినిమా రిలీజ్ రోజు కటౌట్ లు కట్టడం, రక్తదానాలు చేయడం చూసుంటాం. మరీ కాదంటే సినిమా టికెట్లు కూడా వేలం పాటలో లక్షల్లో కొనేవాళ్లని చూసుంటాం. కానీ ఇదేం అభిమానం రా బాబు...అభిమాన హీరో సినిమా చూసేందుకు ఏకంగా దేశాల సరిహద్దులే దాటేశారు. ప్రయాణ ఖర్చుల కోసం...వాళ్ల నిత్యవసరాలే తగ్గించుకున్నారంట. ఇది కదా అభిమానం అంటే.
27
టోక్యో నుంచి టాలీవుడ్ దాకా
టోక్యో నుంచి టాలీవుడ్ సినిమా చూడటానికి రావడమంటే మామూలు విషయం కాదు. గుండెల నిండా భావోద్వేగం నింపుకుంటూ రాంచరణ్(పెద్ది ) చూసేందుకు హైదరాబాద్ వచ్చారు...ఇద్దరు జపనీస్. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి. అంత దూరం నుంచి ఇక్కడికే ఎందుకు వచ్చారని అడిగితే...రాం చరణ్ ఫ్యాన్స్ సందడి, థియేటర్ల వద్ద కోలాహలం ఎలాం ఉంటుందో కళ్లారా చూడాలనే ఇక్కడికి వచ్చినట్లు జపాన్‍కు చెందిన మసామీ, క్రిస్ చెబుతున్నారు.
37
రెండురోజుల్లో 10 షోలు చూడనున్న జపనీస్
దక్షిణాది మూవీలకు జపాన్ లో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉందంట. ఒక హైదరాబాద్ లోనే కాకుండా చెన్నైలో కూడా పెద్ది సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారంట. ముందు సింగపూర్‍లోనే ఈ సినిమా చూద్దామని అనుకున్నారు. కానీ లిప్ రీడింగ్ అర్థం కావడం కష్టమని హైదరాబాద్ వచ్చినట్లు జపనీస్ చెబుతున్నారు. అంతేకాదు రెండురోజుల్లో 10 షోలు చూడనున్నారట.
ఈ జపనీస్ మహిళా ఫ్యాన్స్ ఏం చెబుతున్నారంటే...రాం చరణ్ కు బిగ్ ఫ్యాన్స్ అని, మగధీర సినిమాతో ఆయన నటన బాగా ఆకట్టుకుందని చెబుతున్నారు. మళ్లీ RRR మూవీ, రంగస్థలంలో ఆయన యాక్టింగ్‍తో ఇరగదీశారని, అందుకే ఆయన సినిమాలు హిట్ అయినా, ప్లాప్ అయినా పర్లేదు..రాం చరణ్ ఉంటే చాలని అంటున్నారు. ఇందులో మసామీ అనే ఆమె గేమ్ ఛేంజర్ సినిమా చూసేందుకు సింగపూర్ వెళ్లారంట.
57
ఇబ్బంది పెట్టడం లఇష్టం లేదు
గతేడాది రంగస్థలం సినిమా అప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిసినట్లు తెలిపారు. ఈసారి ఆయన పెద్ది సినిమా ప్రమోషన్స్ లో బిజిగా ఉన్నారు కాబట్టి...ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కేవలం సినిమా చూసి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.
67
టీ షర్టులు కూడా డిజైన్ చేయించుకున్న జపనీస్
రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షలు ఖర్చు పెట్టి పెద్ది సినిమా చూసేందుకు వచ్చారంట. అలా అని వీళ్లేమీ రిచ్ పీపుల్ కాదు..ఇండియాకు రావడానికి ఓవర్ టైం డ్యూటీ చేస్తూ...నిత్యవసర ఖర్చులు కూడా తగ్గించుకున్నారంట. ఆఫీసుకు 5 రోజులు సెలవు కూడా పెట్టి పెద్ది సినిమా చూసేందుకు వచ్చినట్లు జపనీస్ చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన కణ్మని సహకారంతో ఇండియా వచ్చినట్లు వారు తెలిపారు.పెద్ది సినిమా కోసం ప్రత్యేకంగా టీ షర్టులు కూడా డిజైన్ చేయించుకున్నారు.
77
తెలుగు నేర్చుకున్న జపాన్ మహిళ
RRR సినిమా తర్వాత ప్యాన్ వరల్డ్ లో తెలుగు సినిమా అరుదైన గౌరవం దక్కింది. ఇక బాహుబలి, కల్కి, ఇలా ఎన్నో దక్షిణాది సినిమాలను ప్రేమిస్తున్నారు. అందుకే గతంలో జూనియర్ NTR ..దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్తే ఆయనపై అభిమానంతో ఏకంగా ఓ మహిళ తెలుగు నేర్చుకుంది.