Srinidhi Shetty: ఐటీ జాబ్ వదిలేసి పాన్ ఇండియా స్టార్ అయిన ఈ హీరోయిన్.. టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్

Published : Oct 27, 2026, 01:42 PM IST

లక్షల ప్యాకేజీ వచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? చదువులోనూ టాపర్ అయిన ఈ బ్యూటీ సక్సెస్ స్టోరీ మీకోసం..

PREV
14
Srinidhi Shetty

గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న చాలామంది హీరోయిన్లు 'నేను డాక్టర్ అవ్వాల్సింది, అనుకోకుండా యాక్టర్ అయ్యాను' అని చెప్పడం మనం తరచుగా వింటుంటాం. కానీ ఈ సౌత్ స్టార్ హీరోయిన్ జర్నీ మాత్రం అందరికంటే చాలా డిఫరెంట్. ఆమె అందంలోనే కాదు, చదువులోనూ మహా చురుకు. నెలకు లక్షల జీతం వచ్చే మల్టీనేషనల్ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాబ్ వదిలేసి, ఇప్పుడు ఇండియన్ సినిమానే తన వైపు చూసుకునేలా చేసిన ఆ టాలెంటెడ్ బ్యూటీ ఎవరో తెలుసా?

24
85 శాతం మార్కులతో డిస్టింక్షన్‌లో పాస్

టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ టైమ్‌లో ఆమె వాళ్ల అమ్మను కోల్పోయింది. ఆ బాధలోనూ పట్టుదల వదలకుండా ఏకంగా 94 శాతం మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (EEE)లో 85 శాతం మార్కులతో డిస్టింక్షన్‌లో పాస్ అయింది. డిగ్రీ పూర్తవ్వగానే బెంగళూరులోని టాప్ ఐటీ కంపెనీ 'యాక్సెంచర్'లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు సక్సెస్‌ఫుల్‌గా పనిచేసింది. కానీ ఆమె మనసంతా యాక్టింగ్, మోడలింగ్ వైపే ఉండేది. చివరికి ఆ సేఫ్ జాబ్‌ను వదిలేసి, సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ బ్యూటీ మరెవరో కాదు.. 'కేజీఎఫ్' ఫేమ్, కన్నడ సోయగం శ్రీనిధి శెట్టి.

34
తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్

లక్షల జీతం వచ్చే ఐటీ జాబ్‌కు రిజైన్ చేశాక శ్రీనిధి అందాల పోటీల వైపు అడుగులేసింది. 2016లో 'మిస్ సుప్రనేషనల్' ఇంటర్నేషనల్ బ్యూటీ క్రౌన్ గెలుచుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె అందం, అభినయం చూసి హోంబలే ఫిల్మ్స్ సంస్థ 'కేజీఎఫ్' సినిమాకు హీరోయిన్‌గా సెలెక్ట్ చేసింది. రాకింగ్ స్టార్ యశ్ సరసన 'రీనా' క్యారెక్టర్‌తో తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. డబ్బు కోసం వచ్చిన ప్రతి ఆఫర్‌ను ఒప్పుకోకుండా, ఏకంగా ఐదేళ్ల పాటు వేరే ఏ ప్రాజెక్టులూ చేయకుండా కేజీఎఫ్ సిరీస్ కోసమే డెడికేట్ అయింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, చియాన్ విక్రమ్‌తో కలిసి 'కోబ్రా' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

44
టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీనిధికి ఫుల్ డిమాండ్ ఉంది. కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్‌గా ఆమె మారిపోయింది. సిద్దు జొన్నలగడ్డతో 'తెలుసు కదా', అలాగే న్యాచురల్ స్టార్ నాని మోస్ట్ అవేటెడ్ మూవీ 'హిట్: ది 3rd కేస్' సినిమాల్లో మెయిన్ రోల్స్ చేస్తోంది. పర్సనల్ లైఫ్‌లో విషాదం, కష్టపడి చదువుకోవడం, ఐటీ జాబ్, ఆపై సినిమా.. ఇలా అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సూపర్ సక్సెస్ అయిన శ్రీనిధి శెట్టి జర్నీ నేటి యూత్‌కు నిజంగానే పెద్ద ఇన్‌స్పిరేషన్.

Read more Photos on
click me!

Recommended Stories