పాపం.. స్మోకింగ్‌కు అడిక్ట్‌ అయిన ఫిలిం స్టార్స్‌.. బయటపడలేకపోయారు!

First Published Aug 15, 2020, 11:59 AM IST

సినిమా ప్రదర్శనకు ముందు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న కార్డ్ వేస్తారు. కానీ కొంత మంది స్టార్స్‌ మాత్రం ఆ స్మోకింగ్‌కు బానిసలైపోయారు. బాలీవుడ్‌ లో అలాంటి స్టార్స్ చాలా మందే ఉన్నారు. స్మోకింగ్‌ను వదిలి పెట్టలేక ఇబ్బంది పడుతున్న అలాంటి స్టార్స్‌ పై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్ మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ చాలా కాలంగా స్మోకింగ్‌కు అడిక్ట్‌ అయ్యింది. ఆమె చాలా కాలంగా ఈ వ్యసనం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తోంది.
undefined
బాలీవుడ్ కింగ్ ఖాన్‌షారూఖ్ ఖాన్ స్మోకింగ్‌కు అడిక్ట్ అయ్యాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూరోజుకు 100 సిగరెట్లు తాగుతున్నానని చెప్పాడు. అన్నం తినటం మర్చిపోయినా సిగరెట్ తాగటం మాత్రం మర్చిపోనని చెప్పాడు.
undefined
రణబీర్ కపూర్ 15 ఏళ్లవయసు నుంచేస్మోకింగ్ చేస్తున్నాడు. షూటింగ్ సమయంలోనూ రణబీర్‌ చాలా సార్లు స్మోకింగ్ కోసం బ్రేక్‌ తీసుకుంటాడట. దీంతో చాలా సందర్భాల్లో రణబీర్ తీరుపై యూనిట్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారన్న టాక్‌ కూడా ఉంది.
undefined
రాణి ముఖర్జీ కూడా ధూమపానానికి బానిస. ఆమె ఈ విషయాన్ని బహిరంగంగానే అంగీకరించింది. ఆమె ధూమపానం మానేయడం అసాధ్యం అని కూడా చెప్పింది.
undefined
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌ కూడా ఒకప్పుడు చైన్‌ స్మోకర్‌. కానీ తన కొడుకు, కూతురు కారణంగా అజయ్ స్మోకింగ్ మానేశాడు.
undefined
వివాదాస్పద నటి కంగనా రనౌత్ కూడా స్మోకింగ్‌కు అడిక్ట్ అయ్యింది. 19 ఏళ్ల వయసులో ఆమె స్మోకింగ్ చేయటం ప్రారంభించింది. ఆమె రోజుకు 10 నుంచి 12 సిగరెట్లుకాలుస్తుందట.
undefined
సంజయ్‌ దత్ సిగరెట్‌తో పాటు మత్తు పదార్థాలకు అడిక్ట్ అయ్యాడు. జైలులో ఉన్న సమయంలో కూడా సంజయ్‌ తన అలవాటును మానుకోలేక సిగరెట్లు కాల్చేవాడట.
undefined
అలనాటి అందాల నటి కొొంకన్‌ సేన్‌ శర్మ కూడా చైన్‌ స్మోకర్. ఆమె సిగరెట్ కాల్చకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని స్థాయికి ఆ వ్యసనానికి అడిక్ట్ అయ్యింది.
undefined
బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా కూడా ధూమపానానికి బానిస. ఈ వ్యసనం కారణంగానే ఆమె క్యాన్సర్ బారిన పడింది.
undefined
click me!