Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు

Published : Sep 06, 2026, 09:56 PM IST

Bigg Boss Telugu 10: నిజామాబాద్ కుర్రాడుగా.. అగ్నిపరీక్ష సీజన్ 2 లో అడుగుపెట్టిన ఆర్జే చరణ్.. అక్కడ అదరగొట్టి.. ప్రేక్షకుల మనసు గెలిచి.. ఇప్పుడు ఏకంగా.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

PREV
12
నిజామాబాద్ కుర్రాడు..

ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ 10వ సీజన్‌లోకి కామనర్ల కేటగిరీలో అడుగుపెట్టాడు ఆర్జే చరణ్ మహదేవ్. బిగ్ బాస్ ప్రవేశపెట్టిన 'అగ్నిపరీక్ష 2' ద్వారా ఎంపికైన ఈ కామనర్.. తనదైన ఆట తీరుతో, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

మల్టీ టాలెంటెడ్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించిన చరణ్ మహదేవ్, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఆల్ ఇండియా రేడియో లో రేడియో జాకీగా తన కెరీర్ ప్రారంభించాడు. కేవలం ఆర్జేగానే కాకుండా పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాంకర్‌గా ఇంటర్వ్యూలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికి డ్యాన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే పిల్లలకు డ్యాన్స్ టీచర్‌గా శిక్షణ ఇవ్వడంతో పాటు, ఆన్‌లైన్ ద్వారా వీడియో ఎడిటింగ్‌ కూడా నేర్పిస్తుంటాడు.

22
హౌస్‌లో చరణ్ పెర్ఫార్మెన్స్..

రేడియో జాకీగా ఉన్న సుదీర్ఘ అనుభవంతో హౌస్‌లో తన గొంతును బలంగా వినిపిస్తున్నాడు చరణ్. ఎలాంటి మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను స్పష్టంగా చెబుతున్నాడు. ఫిజికల్ అండ్ మైండ్ గేమ్స్ ఏదైనా సరే స్టార్టింగ్ నుంచే చురుగ్గా పాల్గొంటూ తోటి కంటెస్టెంట్లు ఆమన్ మసూద్, రోహిత్ నాయుడు లాంటి వారికి గట్టి పోటీ ఇస్తున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో చురుగ్గా ఉండే చరణ్ మహదేవ్.. ఇప్పుడు బిగ్ బాస్ వేదికపై తన బహుముఖ ప్రజ్ఞను చూపుతూ ఏ స్థాయిలో రాణిస్తాడో, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి

Read more Photos on
click me!

Recommended Stories