Shalini Damera: అభిజీత్‌తో షూస్‌ తుడిపించుకొని ఏకంగా బిగ్‌ బాస్‌ 10 హౌజ్‌లో తిష్ట.. షాలిని దామెర లెక్క వేరే లెవల్‌

Published : Sep 06, 2026, 09:31 PM IST

కామనర్‌గా వచ్చి `అగ్నిపరీక్ష`లో పాల్గొని రచ్చ చేసింది షాలిని దామెర. తనదైన ఆటతో మెప్పించిన ఆమె ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10కి ఎంపికైంది. మరి ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది చూస్తే.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి కామనర్‌ షాలిని దామెర

బిగ్‌ బాస్‌ తెలుగు 10లోకి కామనర్‌ విభాగంలో గ్లామర్‌ బ్యూటీ షాలిని దామెర అడుగుపెట్టారు. అందంతో ఆకట్టుకోవడంతోపాటు తనదైన ఆటతో మెప్పించారు. అయితే షూట్‌ క్లీన్‌ చేసే విషయంలో అభ్యంతరం తెలిపి హాట్ టాపిక్‌ అయ్యారు. జడ్జ్ అయిన అభిజీత్‌ ఆమె షూస్‌ క్లీన్‌ చేయడం విశేషం. ఇది బాగా వైరల్‌ అయ్యారు. ఆ తర్వాత అగ్నిపరీక్షలో టఫ్‌ కాంపిటీషన్‌ ఇచ్చి మెప్పించారు. టాస్కుల్లో దూకుడుగా వ్యవహరించడం, తన నిర్ణయాలను గట్టిగా సమర్థించుకోవడంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్నిపరీక్షలో ఆమె పలుమార్లు లీడర్‌గా నిలవడంతో పాటు, ఇతర కంటెస్టెంట్లతో పోటీ పడుతూ తన గేమ్‌ ప్లాన్‌ను చూపించారు. దీంతో ఇప్పుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ ని సొంతం చేసుకున్నారు.

24
సోషల్‌ మీడియాతో గుర్తింపు

కరీంనగర్‌కి చెందిన షాలిని దామెర సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఫ్యాషన్‌, రీల్స్‌, ఫొటోషూట్స్‌, డిజిటల్‌ కంటెంట్‌ ద్వారా నెటిజన్లకు పరిచయం అయ్యారు. డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులర్‌ అయ్యారు. అగ్నిపరీక్షలో పాల్గొన్న తర్వాత ఆమెకు సోషల్‌ మీడియాలో మరింత ఫాలోయింగ్‌ పెరిగింది.

34
అగ్నిపరీక్షలో అసలు హైలైట్‌!

అగ్నిపరీక్షలో షాలిని ఆటతీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ముఖ్యంగా టాస్కుల్లో తన నిర్ణయాలపై వెనక్కి తగ్గకుండా వాదించడం, ఇతరులను ఎదుర్కోవడం, టీమ్‌ను నడిపించడం వంటి అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఒక ఎపిసోడ్‌లో ఆమెకు ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌’గా గుర్తింపు తెచ్చుకుంది.

44
బిగ్‌బాస్‌లో ఏం చేస్తుందో?

అగ్నిపరీక్షలోనే దూకుడైన గేమ్‌, వాదనల్లో వెనక్కి తగ్గని వైఖరితో కనిపించిన షాలిని.. ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎలా ఆడబోతారన్నది ఆసక్తికరంగా మారింది. కామనర్‌గా వచ్చిన ఆమెకు ఇప్పటికే అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన గుర్తింపు ప్లస్‌ పాయింట్‌గా మారే అవకాశం ఉంది. కప్పే లక్ష్యంగా ముందుకు సాగే ఆమె బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఎంత వరకు రచ్చ చేస్తుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories