Master Bharath: తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేలా అలరించిన నటుడు మాస్టర్ భరత్. వయసు పెరిగే కొద్దీ ఆఫర్లు తగ్గడంతో సినిమాలకు కాస్త దూరమయ్యాడు. తల్లి చివరి కోరికను నెరవేర్చడానికి భరత్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా?
తెలుగు చలనచిత్ర రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి, తనదైన కామెడీ టైమింగ్, ముద్దులొలికే రూపం, అద్భుత నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు భరత్ రెడ్డి. 'మాస్టర్ భరత్' అని పిలిస్తేనే టాలీవుడ్ ఆడియన్స్‌కు ఆయన గుర్తొస్తారు. 'పోకిరి', 'ఢీ', 'రెడీ', 'బింబిసార' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హాస్యం పండించి, స్టార్ హీరోలకు సమానంగా గుర్తింపు సంపాదించుకున్నారు భరత్. ఇప్పుడు జీవితంలో మరొక అడుగు ముందుకు వేశారు.
24
బాలనటుడిగా దూసుకెళ్లిన భరత్..
చిన్నతనంలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన భరత్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శ్రీను వైట్ల వంటి దిగ్గజాల కలయికలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. 'రెడీ' సినిమాలో "ఏవండీ.. నాన్నగారూ!" అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ మీమ్స్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డజన్ల కొద్దీ సినిమాల్లో నటించి, 'నంది అవార్డు'ను కూడా సొంతం చేసుకున్నారు.
34
బరువు తగ్గి కొత్త లుక్‌లో భరత్..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంత పేరు తెచ్చుకున్నా, వయసు పెరిగే కొద్దీ నటుడిగా నిలదొక్కుకోవడం ఎవరికైనా పెద్ద సవాలే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు బొద్దుగా ఉన్న భరత్, టీనేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించారు. కఠినమైన వర్కౌట్స్, ఆహార నియమాలతో ఏకంగా కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్‌గా, ఫిట్‌గా మారారు. ఆయన మేకోవర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ, బరువు తగ్గి లుక్ మార్చుకున్నప్పటికీ హీరోగా అవకాశాలు రాలేదు. దాంతో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో నటించారు. అల్లు శిరీష్ నటించిన చిత్రాలలో నటిస్తూ తనదైన శైలిలో కామెడీ పండించారు.
తల్లి కోరిక నెరవేర్చాలని.. యాక్టర్ నుంచి డాక్టర్‌గా!
ఇండస్ట్రీలో డాక్టర్ చదివి నటులుగా మారినవారు చాలామంది ఉన్నారు. కానీ భరత్ మాత్రం యాక్టర్ నుంచి డాక్టర్‌గా మారి ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత భరత్ చదువుపై దృష్టి పెట్టారు. బాగా చదివి మెడిసిన్ సీటు సాధించారు. ఆయన తన MBBS విద్యను విజయవంతంగా పూర్తి చేశారని సమాచారం. . చిన్నప్పటి నుంచి చదువులోనూ చురుగ్గా ఉండే భరత్, తాను డాక్టర్ కావాలనేది తన తల్లి కమలాసిని కోరిక అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
అందుకోసమే చెన్నైలో మెడిసిన్ (MBBS) చదువును పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, 2025 మే నెలలో ఆయన తల్లి గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆమె ఆశయానికి అనుగుణంగానే రాత్రింబవళ్లు కష్టపడి చదివి మెడికల్ కోర్సును పూర్తి చేసి డాక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారట భరత్. మరి తర్వాత కాలంలో ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.