Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే

Published : Oct 07, 2026, 07:30 AM IST

Soundarya: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సౌందర్య 2004లో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. అయితే చనిపోవడానికి ముందు ఆమె తన మేనకోడలితో ఏ విషయం గురించి మాట్లాడారో తెలుసా?

PREV
14
సావిత్రి తరువాత మహానటి సౌందర్యనే..

అందమైన చీరకట్టు, చిరునవ్వుతో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే కన్నడ కుట్టి, సౌత్ ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేశారు సౌందర్య. గ్లామర్ షోలకు దూరంగా, పద్ధతైన పాత్రలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగారు. కానీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సౌందర్య స్థానం ఎప్పటికీ పదిలమే. మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే అని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. ఆమె సహజ సౌందర్యం, నటన, పద్ధతైన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

24
ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర

'మనవరాలి పెళ్లి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సౌందర్య.. ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చీరకట్టులో, గృహిణి పాత్రల్లో ఆమె ఒదిగిపోయిన తీరు అద్భుతం. ఎలాంటి గ్లామర్ షో లేకుండానే టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే విధి ఆడిన నాటకానికి బలయ్యారు.

సౌందర్య మనల్ని వదిలి వెళ్లిపోయి ఇన్నేళ్లవుతున్నా.. ఆమెపై అభిమానులకు ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఆమె సినిమాలు, పర్సనల్ లైఫ్, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

34
సక్సెస్‌ఫుల్ హీరోయిన్

డాక్టర్ కావాలని కలలు కన్న సౌందర్య.. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున లాంటి సౌత్ స్టార్ హీరోలందరి సరసన నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వెంకటేష్, సౌందర్య కాంబినేషన్‌కు అప్పట్లో ఓ రేంజ్ క్రేజ్ ఉండేది.

2004 ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోయారు. 'శివశంకర్' సినిమా షూటింగ్‌తో పాటు ఇతర పనుల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ ఘోరం జరిగింది. అయితే చనిపోవడానికి ముందు సౌందర్య తన మేనకోడలితో మాట్లాడారట.

44
కాటన్ చీరలు లేవు

ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు.. తన దగ్గర సరిపడా కాటన్ చీరలు లేవని, క్యాంపెయిన్ కోసం కొత్త కాటన్ చీరలు కొనాలని ఆమె తన మేనకోడలితో చెప్పారు. అలాగే కుంకుమ కూడా తెప్పించమని అడిగారట. మేనకోడలితో ఈ విషయాలు మాట్లాడిన తర్వాతే ఎన్నికల ప్రచారానికి విమానంలో బయలుదేరిన సౌందర్య.. ఆ ప్రమాదంలో ప్రాణాలు వదిలారు.

కేవలం తెలుగులోనే కాదు కన్నడ, హిందీ ఇండస్ట్రీల్లోనూ సౌందర్య తన మార్క్ చూపించారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా తక్కువ టైమ్‌లోనే విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సౌందర్య.. అభిమానుల మనసుల్లో ఎప్పటికీ బతికే ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories