రాజమౌళి జడ్జ్ చేసిన మూవీ, కార్తికేయ నిర్మించిన చిత్రం, బాహుబలి నిర్మాతలు తీసిన సినిమా, కొత్త దర్శకుడు, ఎన్టీఆర్ ప్రమోషన్, మహేష్ బాబు ట్వీట్లు, ఫహద్ ఫాజిల్ హీరో.. ఇంత మంది కలిసి చేసిన ఈ చిత్రానికి ఇంతటి దారుణమైన కలెక్షన్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. చిన్న సినిమాలు డీసెంట్‌గా వసూళ్లని రాబటిదే, వాటితో పోటీలో ఈ చిత్రం వెనకబడింది. డీలా పడింది. ఓవరాల్‌గా డిజాస్టర్ దిశగా వెళ్తుందని ట్రేడ్ సైట్లు చెబుతున్నాయి. దీంతో ఎన్టీఆర్, రాజమౌళి, మహేష్ బాబులపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. మీ జడ్జ్ మెంట్ ఇదేనా అంటున్నారు.