కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గతేడాది నటించిన భైరతి రణగల్ చిత్రం మంచి విజయం సాధించింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మైనింగ్, నీటి సమస్య నేపథ్యంలో రూపొందింది. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో అదరగొట్టింది.
24
Bhairathi Ranagal
తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. తెలుగు వర్షన్ ఆహా ఓటీటీ లో ఫిబ్రవరి 13 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ అయిందో లేదో అప్పుడే టొరెంట్ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా లీక్ అయింది. అంతే కాదు టాప్ లో ట్రెండ్ అవుతోంది.
34
Bhairathi Ranagal
చిన్నతనంలోనే తన ఊరి ప్రజలు మంచి నీటి కోసం పడుతున్న కష్టాలు చూసి భైరతి రణగల్ తట్టుకోలేకపోతాడు. అధికారులని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం ఉండదు. దీనితో ప్రభుత్వ కార్యాలయంలో బాంబు వేసి బాల్యంలోనే జైలుపాలవుతాడు. జైల్లోనే చదువుకుని లాయర్ గా తన ఊరికి తిరిగి వస్తాడు.
44
Bhairathi Ranagal
ఆ టైంలో విలన్ చేసే అక్రమ మైనింగ్ వల్ల తన ఊరి ప్రజలు బలవుతుంటారు. న్యాయవాది అయిన భైరతి ఆ సమస్యని ఎలా అడ్డుకున్నాడు అనేది ఈ చిత్ర మిగిలిన కథ. ఈ చిత్రంలో రాహుల్ బోస్, దేవరాజ్, అవినాష్ ఇతర పాత్రల్లో నటించారు.