‘ఖుషి టైటిల్’ సాంగ్ ప్రోమో.. షూటింగ్ కు ‘ధనుష్51’ రెడీ.. దుల్కర్ సల్మాన్ మూవీ ప్రకటన.. ఈరోజు మూవీ అప్డేట్స్..

First Published | Jul 27, 2023, 8:39 PM IST

ఈరోజు మూవీ అప్డేట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ‘ఖుషి’, ‘ధనుష్51’, దుల్కర్ సల్మాన్ చిత్రాలకు సంబంధించిన మూవీ అప్డేట్స్  తాజాగా అందాయి. మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ సినిమాలు, క్రేజీ కాంబినేషన్లపై ఆసక్తికరమైన అప్డేట్స్  అందాయి. వాటి డిటేయిల్స్  ఇలా ఉన్నాయి.
 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ (Kushi). శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైవీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియన్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ అందుతున్నాయి. ఇక ఈమూవీ సాంగ్స్ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ‘నా రోజా నువ్వే’ సాంగ్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. Naa Roja Nuvve సాంగ్ కు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్  దక్కాయి. 
 

ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రేపు టైటిల్ సాంగ్ కూడా విడుదల కానుంది. ‘ఖుషీ నువ్వు కనబడితే’ అంటూ సాంగే పాట కోసం మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా టైటిల్ సాంగ్ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సాంగ్ కూ మంచి రెస్పాన్స్  దక్కుతోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. 


తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ దక్కించుకున్నారో తెలిసిందే. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగు మూవీస్ కూడా చేస్తున్నారు. చివరిగా తెలుగులో ’సార్’ సినిమా చేసి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నెక్ట్స్  ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా ధనుష్51వ చిత్రంపై అప్డేట్ అందించారు. త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మేకర్స్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపుదిద్దుకోనుంది. మిగితా వివరాలను త్వరలో అందించనున్నారు. 
 

మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ - దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.24గా రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రేపు మధ్యహ్నం 01 : 44 నిమిషాలకు ప్రకటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ‘సీతారామం’తో దుల్కర్ భారీ హిట్ సొంతం చేసుకున్నారు. ఇటు వెంకీ అట్లూరి ‘సార్’ చిత్రంతో మెప్పించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబో లాక్ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది.

సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `రుద్రంకోట‌`.  ఏఆర్ కె విజువ‌ల్స్ ప‌తాకంపై  రాము కోన ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ ఆర్కా కండ‌వ‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  అనిల్‌, విభీష, రియా  హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  ఇటీవ‌ల  సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  ఆగ‌స్ట్ నెల‌లో  స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.
 

అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘దిల్ సే’. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు.  

Latest Videos

click me!