ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఏకంగా 60 ఏళ్ల వయసులో పెద్ద షాకే ఇచ్చారు. షష్టి పూర్తి వయసులో రెండో వివాహం చేసుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచారు. ఆశిష్ విద్యార్థి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో ఆశిష్ విద్యార్థి గుడుంబా శంకర్, పోకిరి, అదుర్స్, చిరుత, అలా మొదలయింది, నాయక్ లాంటి చిత్రాలతో గుర్తింపు పొందారు.