డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతూ ఆ ఘనత సాధించిన మోడల్ .. ఎవరీ సోఫియా జిరావు ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 17, 2022, 08:08 PM IST

గ్లామర్ ప్రపంచంలో రాణించాలనే అందమైన యువతులకు సరైన వేదిక మోడలింగ్. ఎందరో మహిళలు మోడలింగ్ లో రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నారు. 

PREV
16
డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతూ ఆ ఘనత సాధించిన మోడల్ .. ఎవరీ సోఫియా జిరావు ?

గ్లామర్ ప్రపంచంలో రాణించాలనే అందమైన యువతులకు సరైన వేదిక మోడలింగ్. ఎందరో మహిళలు మోడలింగ్ లో రాణిస్తూ గుర్తింపు పొందుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ  ఎందరో అమ్మాయిలు ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. 

 

26

అలాంటిది  సోఫియా జిరావు అనే యువ మోడల్ అందరికి అందర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. పెట్రో రికో ప్రాంతానికి చెందిన సోఫియా వయసు 25 ఏళ్ళు. సోఫియా డౌన్ సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతోంది. డౌన్ సిండ్రోమ్ అంటే జన్యుపరమైన వ్యాధి. 

36

అలాంటి వ్యాధితో బాధపడుతూ విక్టోరియా సీక్రెట్ మోడల్ గా అవకాశం దక్కించుకున్న తొలి మోడల్ గా సోఫియా రికార్డు సృష్టించింది. దీనితో ప్రపంచం మొత్తం సోఫియాని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

 

46

సోఫియా ప్రస్తుతం పలు లింగరీ బ్రాండ్స్ కి మోడల్ గా రాణిస్తోంది. అందమైన మోడల్ గాబాగా పాపులర్ ఐంది కూడా. ఇటీవలే ఆమెకు విక్టోరియా సీక్రెట్ మోడల్ గా అవకాశం దక్కించుకుంది. నేను ఈ స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాను. నేడు నా కలలు సాకారం అయ్యాయి అంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

56

తనకున్న డౌన్ సిండ్రోమ్ వ్యాధి గురించి సోఫియా ప్రస్తావించింది. ఇది జన్యు పరమైనది.  ఈ వ్యాధి ఉండే వారు ఎక్కువ క్రోమోజోములతో పుడతారు. దానివల్ల మెదడు, మానసిక సమస్యలు ఎదురవుతాయి. వాటిని అధికమిస్తూ తాను ఈ స్థాయికి చేరుకున్నట్లు సోఫియా పేర్కొంది. 

66

తాను ఆ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. నాలో ఉన్న మోడల్ ని గుర్తించి అవకాశం ఇచ్చిన విక్టోరియా సీక్రెట్ కి సోఫియా కృతజ్ఞతలు తెలిపింది. తాను ఈ సంస్థ కోసం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సోఫియా పేర్కొంది. 

click me!

Recommended Stories